గ్రేటర్ పోలింగ్ సీసీటీవీ పుటేజీ సమాచారం ఇవ్వండి: శ్రవణ్ దాసోజు

ABN , First Publish Date - 2020-12-06T00:34:13+05:30 IST

గ్రేటర్ ఎన్నికలు, ఫలితాల సరళిపై పూర్తి సమాచారం కోసం కాంగ్రెస్ నేత, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా. శ్రవణ్ దాసోజు ఆర్టీఐకి దరఖాస్తు చేశారు

గ్రేటర్ పోలింగ్ సీసీటీవీ పుటేజీ సమాచారం ఇవ్వండి: శ్రవణ్ దాసోజు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలు, ఫలితాల సరళిపై పూర్తి సమాచారం కోసం కాంగ్రెస్ నేత, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా. శ్రవణ్ దాసోజు ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. గ్రేటర్ ఎన్నికలు, ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తమౌతునాయని ఆయన ఆర్టీఐకి దరఖాస్తు చేయడం గమనార్హం.

 

అధికార పార్టీ టీఆర్ఎస్, ఎంఐఎంలు రిగ్గింగ్ కు పాల్పడినట్లు పలు కధనాలు వినిపిస్తున్నాయి. పోలింగ్ చివరి నిమిషం వరకూ 38% పోలింగ్ జరిగినట్లు మొదట సమాచారం వచ్చింది. కానీ చివరి గంట తర్వాత ఎలక్షన్ కమీషన్ మాత్రం పోలింగ్ 50శాతం జరిగిందని ప్రకటించడం కూడా పలు అనుమానాలకు తావిచ్చిందని శ్రవణ్ దాసోజు తెలిపారు. ఈ నేపధ్యంలో సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గ్రేటర్ ఎన్నికల పూర్తి సమాచారంని ఆయన కోరారు. 

 

జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 150డివిజన్లలోని ప్రతి పోలింగ్ భూత్ లో పోలింగ్ మొదలైన సమయం నుంచి చివరి సమయం వరకూ సిసిటీవీ పుటేజీలను, వెబ్ కాస్టింగ్ రికార్డింగ్ వీడియో డేటా పూర్తి సమాచారం అందజేయాలని  శ్రవణ్ కోరారు.అదే విధంగా ఎన్నికల్లో భాగంగా 150 డివిజన్ల వారిగా మొత్తం పోలైన ఓట్ల వివరాలతో పాటు మొత్తం బ్యాలెట్ పేపర్ లపై స్వస్తిక్ ఏతర గుర్తు ద్వారా కానీ మారే ఇతర మార్క్ ద్వారా పోలిన మొత్తం ఓట్లు వివరాలు ఇవ్వాలని ఆయన దరఖాస్తులో పేర్కొన్నారు 

Updated Date - 2020-12-06T00:34:13+05:30 IST