హైదరాబాద్: జలమండలి ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ బహిరంగ లేఖ రాశారు. జలమండలి కార్మికులకు పీఆర్సీ బకాయిలు మొత్తం ఒకే దఫాలో వెంటనే చెల్లించాలన్నారు. జలమండలిలో 1680 ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, జల మండలి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులో ప్రభుత్వ ఆస్పత్రి నిమ్స్ని చేర్చాలన్నారు. విధి నిర్వహణలో కోవిడ్ బారిన పడి చనిపోయిన జలమండలి కార్మికులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని దాసోజు శ్రావణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.