లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకూ ఇంట్లోనే ఉండండి- దాసోజుశ్రావణ్‌

ABN , First Publish Date - 2020-04-03T21:06:54+05:30 IST

ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకూ అందరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ ప్రజలకు సూచించారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకూ ఇంట్లోనే ఉండండి- దాసోజుశ్రావణ్‌

హైదరాబాబాద్‌: ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకూ అందరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ ప్రజలకు సూచించారు. కరోనా మహమ్మారి నుంచి బయట పడేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్ద సూచించిన జాగ్రత్తలు ముఖానికి మాస్క్‌లు ధరిస్తూ, చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. హ్యాడ్‌శానిటైజర్లను వాడాలని, గుంపులుగా, సమూహాలకు దూరంగా ఉండాలని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.శుక్రవారం ఖైరతాబాద్‌ నియోజక వర్గంలోని జూబ్లీహిల్స్‌ డివిజన్‌లోని అంబేద్కర్‌నగర్‌ బస్తీలో కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకులు వెల్దండ వెంకటేశ్‌, కాటూరి రమేష్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను, కూరగాయలను, కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన దాసోజుశ్రావణ్‌ ప్రజలు కరోనా వైరస్‌బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యకరమైన పద్దతులను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అరుణ్‌, మహిళా నాయకులురా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భందా దాదాపు 500 మందికి ఉచితంగా నిత్యావసర సరుకులను అందజేశారు. 


Updated Date - 2020-04-03T21:06:54+05:30 IST