అఘాయిత్యాలపై కేసీఆర్ నోరువిప్పకపోవడం బాధాకరం: దాసోజు శ్రవణ్

ABN , First Publish Date - 2022-06-10T22:35:55+05:30 IST

Hyderabad: బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి నోరువిప్పకపోవడం బాధాకరమని ఏఐసీసీ ప్రచార కార్యదర్శి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్త్రీ, శిశు

అఘాయిత్యాలపై కేసీఆర్ నోరువిప్పకపోవడం బాధాకరం: దాసోజు శ్రవణ్

Hyderabad: బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి నోరువిప్పకపోవడం బాధాకరమని ఏఐసీసీ ప్రచార కార్యదర్శి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. అత్యాచార ఘటనలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గతంలో మహిళల పట్ల‌ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. మంచి అధికారిగా పేరున్న సీవీ ఆనంద్ కూడా వణుకుతూ మాట్లాడటం.. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతుందన్నారు.  

Updated Date - 2022-06-10T22:35:55+05:30 IST