Abn logo
May 30 2020 @ 22:45PM

దాసరి లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది

దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావు మూడవ వర్ధంతి సందర్భంగా శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌లోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘దాసరిగారిని తలుచుకోని రోజు లేదు. ఆయన ఉంటే  కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీకి జరిగిన నష్టాన్నుంచి వేరే రకంగా కాపాడేవారు’ అన్నారు. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘ఎటువంటి విషయాల్లోనైనా దాసరిగారు వ్యవస్థలను ముందు పెట్టి నడిపించేవారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’ అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘నేను బతికున్నంతవరకూ మే 4న దాసరిగారి జయంతిని, 30న ఆయన వర్ధంతిని కచ్చితంగా నిర్వహిస్తాను. అలాగే దాసరి అవార్డ్స్‌ ఫంక్షన్‌ను ఆయన కుటుంబ సభ్యులు, శిష్యుల సమక్షంలో జరుపుతాను’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement