వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-27T06:11:16+05:30 IST

కైకలూరు శ్రీశ్యామలాంబ అమ్మవారి ఆలయం లో శ్రీచండీ మహాయాగ సహిత శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారం భమయ్యాయి.

వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం
శ్రీశ్యామలాంబ అమ్మవారికి పట్టువస్ర్తాలు తెస్తున్న ఎమ్మెల్యే దంపతులు

కైకలూరు, సెప్టెంబరు 26: కైకలూరు శ్రీశ్యామలాంబ అమ్మవారి ఆలయం లో శ్రీచండీ మహాయాగ సహిత శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారం భమయ్యాయి. సోమవారం ఉదయం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దంప తులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. గోపూజ చేశారు. అమ్మవారు మొదటిరోజు శ్రీబాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమన్నారాయణ గోష్ఠి మహిళలు లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఆలయ చైర్మన్లు గుర్రం రాంబాబు, బూరుబోయిన మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో వీఎన్‌కే శేఖర్‌ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు నిర్వహించి ప్రసా దాన్ని పంపిణీ చేశారు.  ఎంపీపీ  కృష్ణమోహన్‌, సర్పంచ్‌ నవరత్న కుమారి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చెరుకువాడ బలరామరాజు, పంజా రాంబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారంనాడు  అమ్మవారు  కాశీఅన్నపూర్ణ  అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మండవల్లి:  మండవల్లిలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు బాలత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. లోకుమూడి దత్తాశ్రమంలో అమ్మవారిని బాల త్రిపురసుందరిగా  అలంకరిం చారు. హరిమోహన్‌ దంపతుల ఆర్థిక సాయంతో భక్తులకు అన్నసమారాధన చేశారు.  ట్రస్టీలు నాగరాజు, రామకృష్ణరాజు, తెలగంశెట్టి ఫణి, గాదంశెట్టి కృష్ణ, దాసరి శ్రీమన్నారాయణ, దాసరి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

కలిదిండి: మండలంలో  శరన్నవరాత్రులు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సంతోషపురం, మూల్లంక, గుర్వాయిపాలెం, కలిదిండి, సానారుద్రవరం, కోరుకొల్లు, తాడినాడ గ్రామాల్లో దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  భవాని మాలధారులు అమ్మవారి ఆలయాల్లో భజనలు నిర్వహించారు.

ముదినేపల్లి: పెయ్యేరులో దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు స్వర్ణకవచా లంకృత  దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. దాతలు శొంఠి మాధవరావు దంప తులు పూజలు నిర్వహించారు.  చేవూరుపాలెంలోని పరసావారి అంకమ్మ  ఆలయంలో అమ్మవారిని దుర్గమ్మ అలంకరించగా సర్పంచ్‌ విశ్వేశ్వరరావు  పూజలు చేశారు. శ్రీహరిపురం గంగానమ్మ ఆలయంలో, అల్లూరులో అగ్ని కుల క్షత్రియ యూత్‌ ఆధ్వర్యంలో, ముదినేపల్లి, బొమ్మినంపాడు, విశ్వనా ద్రిపాలెం తదితర గ్రామాల్లో దుర్గమ్మను విశేషంగా అలంకరించి  పూజలు చేశారు.  అల్లూరు పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చైర్మన్‌ గుళ్లపల్లి సుధారాణి, ఈవో  శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ముదినేపల్లి రూరల్‌: సింగరాయిపాలెంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్‌ మీగడ నెలబాలుడు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఆలయ ఈవో శింగన పల్లి శ్రీనివాసరావు నిర్వహణలో అర్చకులు వేణుగోపాల కృష్ణమాచా ర్యులు పూజాదికాలు జరిగాయి. సింగరాయిపాలెంలోని అమృతేశ్వరస్వామి వారి ఆలయంలో  అమ్మవారు  బాల త్రిపుర సుందరిగా  దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్‌ కంతేటి వరలక్ష్మి, ధర్మకర్తల మండలి నిర్వహణలో  అర్చకులు రుద్ర పాక సత్య వరప్రసాద్‌ పూజలు చేశారు.  ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. 

నూజివీడు టౌన్‌: నూజివీడు కోట మహిషాసుర మర్దిని అమ్మవారు  శరన్నవరాత్రుల్లో తొలిరోజు రజత కవచాలంకృతులై  దర్శనమిచ్చారు. తొలుత కలశ ప్రతిష్ఠాపన, అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణా చార్యులు శ్రీచక్రార్చన నిర్వహించారు.  నూజివీడుకు చెందిన కోడూరుపాటి శోభనాచలం రజత మకర తోరణాన్ని బహూకరించారు.

ముసునూరు: మండలంలో శరన్ననవరాత్రులు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్కిరెడ్డిగూడెం, బలివే శ్రీ రాజరాజేశ్వరిదేవి, ముసునూ రులో రైస్‌మిల్‌ సెంటర్‌లో శ్రీ శక్తి కమిటీ ఏర్పాటు చేసిన అమ్మవారు, అభయాంజనేయ స్వామి ఆలయంలో సగరులు ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవార్లు తొలిరోజు శ్రీ బాలత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ వెంకటేష్‌, సిబ్బంది అమ్మవారికి పూజలు చేశారు. అలాగే ముసునూరు శ్రీ వెంకటాచల స్వామి ఆలయం, గోగులంపాడులో కోడండరామాలయం, చెక్కపల్లిలో  గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, గోపవరంలో అన్నపూర్ణ సహిత కాశీవిశ్వేశ్వర ఆలయాల్లో అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళలు  కుంకుమ పూజలు చేశారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 

ఆగిరిపల్లి: వేద పాఠశాలలో, శుభగిరి శ్రీనివాస సత్సంగంలో, వెంకటా చల మండపంపై శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభించారు. కనసానపల్లి చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో, వట్టిగుడిపాడు సెంటర్‌ రామాల యంలో, ఆగిరిపల్లి షిర్డి సాయిబాబా ధ్యాన మందిరంలో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించారు. సామూహిక కుంకుమార్చనలు  జరిగాయి.

Updated Date - 2022-09-27T06:11:16+05:30 IST