ఆ సందడేది...

ABN , First Publish Date - 2020-10-20T07:10:25+05:30 IST

దసరా వచ్చిందంటే చాలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పండుగ శోభ సంతరించుకునేది. స్కూళ్లకు, కాలేజీలకు పక్షం రోజుల పాటు ఇచ్చే సెలవులతో ఇళ్లకు వచ్చేందుకు ముందస్తుగా ట్రైయిన్లు, బస్సులకు రిజర్వేషన్లు చేయించుకునేవారు. పర్యాటక విహారాలకు తేదీలు ఖరారు చేయించుకునేవారు.

ఆ సందడేది...

 పట్టణాలు, పల్లెల్లో కనిపించని పండుగశోభ
 వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఉద్యోగులు
 స్పెషల్‌ ట్రైన్లు, బస్సులకు తగ్గిన డిమాండు
 కరోనాతో సొంతూళ్లకే పరిమితమైన బంధుమిత్రులు
 ఈసారి దసరా వేడుకలు లేనట్టే


దసరా వచ్చిందంటే చాలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పండుగ శోభ సంతరించుకునేది. స్కూళ్లకు, కాలేజీలకు పక్షం రోజుల పాటు ఇచ్చే సెలవులతో ఇళ్లకు వచ్చేందుకు ముందస్తుగా ట్రైయిన్లు, బస్సులకు రిజర్వేషన్లు చేయించుకునేవారు. పర్యాటక విహారాలకు తేదీలు ఖరారు చేయించుకునేవారు. దసరా పర్వదినాల్లో జరిగే తిరునాళ్లు, సంబరాలను తిలకించేందుకు ఎక్కడ ఉన్నా సరే వారి స్వస్థలాలకు చేరుకునేవారు. ఇప్పుడు అటువంటి సరదాలు, సంతోషాలు కరోనా వైరస్‌ కారణంగా కనమరుగైపోయాయి. దసరా గురించి ఎవరిని అడిగినా నిరాశ, నిస్పృహలతో అప్పుడే దసరా వచ్చిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

నాడు..
దసరా వస్తే చాలు దేశ, విదేశాలతోపాటు వివిధ రాష్ర్టాల్లో ఉన్న వారు సెలవులకు కుటుంబ సమేతంగా సొంతిళ్లకు వచ్చేవారు. షడ్ర సోపేతమైన పిండి వంటకాలు, విందులు ఆరగించడంతోపాటు పండుగ రోజుల్లో జరిగే ఉత్సవాలను తిలకించడం, సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా అన్ని ప్రాంతాలు అప్పట్లో కలకలలాడేవి. బస్సులు, ట్రెయిన్లకు నెలరోజుల ముందే రిజర్వేషన్లు చేయించుకునేవారు. దసరా ఉత్సవాలు కోనసీమలోని అమలాపురం సహా అన్ని ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరిగేవి. వీటిని తిలకించేందుకు ప్రత్యేక బస్సులు వేసుకుని మరీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులేమీ కనిపించడంలేదు. దసరాకు మీ ఊరు వెళ్లడంలేదా అని అడుగు తుంటేచాలు వారి ఆర్థిక సమస్యలను ఏకరువు పెడుతున్నారు. దీనికి తోడు దసరా ఉత్సవాలపై కరోనా నిబంధనలు ఆసరాగా చేసుకుని ఆంక్షలు కఠినతరం చేయడంతో ఈ ఏడాది ఉత్సవాలు జరిగే పరిస్థితులు కూడా లేవనే చెప్పాలి. అమలాపురం పట్టణంలో అత్యం త వేడుకగా జరిగే చెడీ తాలింఖానాలకు సైతం పోలీసులు ఆంక్షలు పెట్టడంతో ఈసారి విజయదశమికి వేడుకలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఊరేగింపులు మాత్రం ఇక లేనట్టే.
నేడు..
కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడవారు అక్కడే ఉండిపోయారు. గత ఏడు నెలలుగా లాక్‌డౌన నిబంధన అమలు, ఇతరత్రా కారణాలతో సాఫ్ట్‌వేర్‌తో సహా ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంతిళ్లకే పరిమితమై వర్క్‌ ఫ్రం హోమ్‌ పేరిట విధులు నిర్వహించడంలో నిమ గ్నమయ్యారు. దాంతో వారి కుటుంబ సభ్యులు కూడా అటు అత్తారింట్లో, ఇటు పుట్టింట్లోను ఉంటున్నారు. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో బస్సు సర్వీసులను ప్రభుత్వం పునరుద్ధరించలేదు. దాంతో కొందరు ప్రైవేటు ట్రావెల్స్‌నే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు దసరాకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్లను గోదావరి జిల్లాల మీదుగా నడిపేవి. ఇప్పుడు అవి కూడా లేవు. ఎక్కడివారు అక్కడే ఉండడంతో రవాణాకు పెద్దగా డిమాండు లేదు. దీనికి ఆర్థికపరమైన సమస్యలు ఆయా కుటుంబాలను చుట్టుముట్టుతుండడంతో పండుగ రోజైనా వారిలో ఆ ఆనందాలు కనిపించడంలేదు. కొందరైతే బెంగుళూరు, హైదరాబాద్‌, విశాఖటపట్నం, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండేవారు రెండు అద్దెలు కట్టుకోలేక ఖాళీచేసి స్వస్థలాల్లోనే ఉంటున్నారు. కరోనా సృష్టించే విలయంలో సతమతమవుతున్న ప్రజలు ఇళ్లకే పరిమి తమై అతికష్టంపై బతుకు నావను నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారి లో ఏ కోశానా ఉత్సాహం కనిపించడంలేదు. మొత్తం మీద దసరా ఈసారి ప్రజల్లో ఎటు వంటి ఉత్సాహాన్ని ఇచ్చే పరిస్థితి లేదు.

Updated Date - 2020-10-20T07:10:25+05:30 IST