ఆర్టీసీకి దసరా ధమాకా!

ABN , First Publish Date - 2021-10-20T05:20:29+05:30 IST

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కుఈ ఏడాది దసరా పండుగ కాసులు కురిపించింది. సిబ్బంది కృషి, అధికారు ల పర్యవేక్షణ వల్ల ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందు లు కలగకుండా అన్ని రూట్లలో బస్సులను నడిపి ప్రజల కు రవాణా సౌకర్యాన్ని అందించింది.

ఆర్టీసీకి దసరా ధమాకా!

ఆర్టీసీకి కలిసొచ్చిన దసరా పండుగ

ఒక్కరోజే రూ.కోటి ఆదాయం

సుభాష్‌నగర్‌, అక్టోబరు 19: నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కుఈ ఏడాది దసరా పండుగ కాసులు కురిపించింది. సిబ్బంది కృషి, అధికారు ల పర్యవేక్షణ వల్ల ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందు లు కలగకుండా అన్ని రూట్లలో బస్సులను నడిపి ప్రజల కు రవాణా సౌకర్యాన్ని అందించింది. కరోనా కారణంగా ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీకి ఈ దస రా పండుగ ఆదాయాన్ని సమకూర్చింది. ఒక్క రోజే కోటి రూపాయల ఆదాయాన్ని సమకూర్చి గత రికార్డులకు స రిసమానంగా నిలిచింది. ఈనెల 13నుంచి 19వరకు దస రా పండుగ కోసం నిజామాబాద్‌ రీజియన్‌ వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడిపారు. రీజియన్‌లోని ఆరు డిపోల పరిధిలో సుమారు 636బస్సులను రెగ్యులర్‌ రూట్లతో పా టు పండుగ కోసం ప్రత్యేక రూట్లలో నడిపి ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. సోమవారం ఒక్క రోజే రెండు లక్ష ల 63వేల 879 కిలో మీటర్లు తిప్పి సుమారు కోటి రూ పాయల ఆదాయాన్ని నిజామాబాద్‌ రీజియన్‌ రాబట్టుకు ని రికార్డు సాధించింది. నిజామాబాద్‌ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఆర్మూర్‌ డిపో పరిధిలో 34వేల 4 కిలో మీటర్లు తిప్పి రూ.12లక్షల 84వేల 458ల ఆదాయాన్ని  సమకూర్చుకుంది. బోధన్‌ డిపో పరిధిలో 47వేల 92 కిలో మీటర్లు తిప్పి రూ.17లక్షల 11వేల 172లను నిజామాబాద్‌ డిపో-1పరిధిలో 40వేల 746కిలో మీటర్లను తిప్పి రూ.15లక్షల 5వేల 210లను, నిజామాబాద్‌ డిపో-2 పరిధిలో  49వేల 207 కిలో మీటర్లకు 22లక్షల 15వేల 342లను, బా న్సువాడ డిపో పరిధిలో 37వేల 136 కిలో మీటర్లు తిప్పి రూ.14లక్షల 58వేల 398లను, కా మారెడ్డి డిపో పరిధిలో 51,684 కిలో మీటర్లు తిప్పి రూ.19లక్షల 44వేల 797లను ఆర్జించిం ది. ఇందులో నిజామాబాద్‌ డిపో-2 అత్యధికం గా 22లక్షల 15వేల 342రూపాయల ఆదాయం లభించగా అత్యల్పంగా ఆర్మూర్‌ డిపో రూ.12లక్షల 84వేల 458ల ఆదాయాన్ని సమకూర్చింది. మొత్తం గా 18న ఒకే రోజు రూ.కోటి 3లక్షల 19వేల 377లను ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఒక్క రోజే కోటి రూపాయల ఆదాయం రావడం పట్ల నిజామాబాద్‌ ప్రాంతీయ అధికారి సుధాపరిమళ హర్షం వ్యక్తం చేశారు. ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. 

బస్టాండ్‌లో ఆర్‌ఎం ఆకస్మిక తనిఖీలు

పలు దుకాణాల యజమానులకు జరిమానా

నగరంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో మంగళవారం ఆర్‌ఎం సుధాపరిమళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న 12 దుకాణాల యజమానులకు జరిమానా విధించా రు. బస్‌స్టాండ్‌ ప్రాంగణంలో దుకాణాలు కలియ తిరుగుతూ దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లో ధరల పట్టికలు ఏర్పాటు చేయాల ని సూచించారు. కొన్ని దుకాణాల్లో ధరల పట్టికను పెట్టించారు. అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని దుకాణాల యజమానులను హెచ్చరించారు. ప్రతీ డిపోలో మేనేజర్లు ధరలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రయాణికులు, వినియోగదారులు ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా డిపో మేనేజర్లకు గానీ, ఆర్‌ఎం కార్యాలయంలో గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Updated Date - 2021-10-20T05:20:29+05:30 IST