Mysore: 7న మైసూరుకు గజరాజులు

ABN , First Publish Date - 2022-08-06T17:27:24+05:30 IST

దసరా ఉత్సవాల కోసం మైసూరుకు గజరాజులు రా నున్నాయి. ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ఆడంబరం

Mysore: 7న మైసూరుకు గజరాజులు

బెంగళూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల కోసం మైసూరుకు గజరాజులు రా నున్నాయి. ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ఆడంబరంగా జరపాలని ప్రభుత్వం తీర్మానించింది. మత్తెగోడు, దుబారె(Mattegodu, Dubare) శిబిరాల నుంచి ఐదు గజరాజులను ఎంపిక చేశారు. వీటిలో మత్తిగోడు నుంచి 63 ఏళ్ల అర్జున, 57 ఏళ్ల అభిమన్యు, 39 ఏళ్ల గోపాలస్వామి, 38 ఏళ్ల మహేంద్ర, 22 ఏళ్ల భీమ, దుబారె శిబిరం నుంచి 44 ఏళ్ల ధనంజయ, 45 ఏళ్ల కావేరి, 40 ఏళ్ల గోపి, 41 ఏళ్ల శ్రీరామ, 63 ఏళ్ల విజయతోపాటు రామపుర అభయారణ్య శిబిరం నుంచి 49 ఏళ్ల చైత్ర, 21 ఏళ్ల లక్ష్మి, 18 ఏళ్ల పార్థసారథి(Parthasarathy)లను ఎంపిక చేశారు. 14 ఏనుగులను ఎంపిక చేశారు. సుదీర్ఘకాలంపాటు అంబారిని మోసిన అర్జున ప్రత్యేకంగా రానుంది. ఈ ఏడాది కూడా అభిమన్యు గజరాజు(Abhimanyu Gajaraju) అంబారి మోయనుంది. ఈనెల 7న గజరాజుల రాక ప్రారంభం కానుంది. నాగరహొళె జాతీయ ఉద్యానవన పరిధిలోని వీరనహసళ్లి మెయిన్‌గేట్‌ వద్ద గజరాజులను స్వాగతించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ప్రస్తుతానికి ఏనుగుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. విడతలవారిగా మైసూరు ప్యాలెస్‏కు గజరాజులు చేరుకోనున్నాయి.

Updated Date - 2022-08-06T17:27:24+05:30 IST