Abn logo
Jun 3 2020 @ 03:45AM

వివక్షపై క్రికెటర్ల నిరసన గళం

ఫ్లాయిడ్ కు సంఘీభావం

జమైకా: జాతి వివక్షతకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఐసీసీ, ఇతర క్రికెట్‌ బోర్డులకు వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామీ విజ్ఞప్తి చేశాడు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  సామీతో పాటు క్రిస్‌ గేల్‌, శ్రీలంక మాజీ ఆటగాడు సంగక్కర కూడా సంఘీభావం ప్రకటించారు. ‘ఎన్నో ఏళ్లుగా నల్ల జాతీయులు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. నా లాంటి వారి పట్ల ఏం జరుగుతుందో ఐసీసీ, ఇతర బోర్డులకు కనిపించడం లేదా? ఈ అన్యాయాన్ని నిలదీయలేరా? ఒక్క అమెరికాలోనే కాదు..అంతటా ఇదే జాఢ్యం. ఇది మౌనంగా ఉండే సమయం కాదు’ అని సామీ ట్వీట్‌ చేశాడు. క్రికెట్‌ కూడా వివక్షకు మినహాయింపేమీ కాదని గేల్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. వివక్షను రూపుమాపే సంస్కృతి సమాజంలో రావాలని సంగక్కర ట్వీట్‌ చేశాడు. ‘భిన్నత్వంలో ఏకత్వం కోసం నిలబడతాం. జాతి వివక్షకు వ్యతిరేకంగా నిలుస్తాం’ అని ఇంగ్లండ్‌ జట్టు ట్వీట్‌ చేసింది.

Advertisement
Advertisement
Advertisement