ప్రభుత్వంపై ధర్మపురి అరవింద్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-07T00:45:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుపంట ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం లేదని బీజేపీ నేత ధర్మపురి అరవింద్ అన్నారు.

ప్రభుత్వంపై ధర్మపురి అరవింద్ ఆగ్రహం

నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం  రైతుపంట ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం లేదని బీజేపీ నేత ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లాలో 30 చెక్కు డ్యామ్లకు 23 చెక్ డ్యాంలు నాబార్డ్ నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మించినదని చెప్పారు. జిల్లాలో 75 చెరువు కుంటల అభివృద్ధికి అమృత సరోవర్ ద్వారా నిధులు వచ్చాయన్నారు. అలాగే గత నాలుగు ఐదు సంవత్సరాలుగా స్కూల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వందల వేల కోట్లు వచ్చిన కాలేశ్వరంలో మునుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు జిల్లాను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అరబ్ నుంచి గంజాయిని ఇంపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. మతకల్లాలు సృష్టించేందుకు ట్రైనింగ్‌కు జిల్లా అడ్డగా మారిందని విమర్శించారు. ఇటువంటి పోలీస్ ఆఫీసర్ లే మతకల్లాలు సృష్టించడానికి పోలీస్ ఆఫీసర్లను నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యకలాపాలను పెంచడానికి సిపి నాగరాజును తెచ్చిపెట్టారు

Updated Date - 2022-07-07T00:45:56+05:30 IST