శివ భక్తులకు ఆహారం అందిస్తున్న దర్గా

ABN , First Publish Date - 2022-03-01T00:03:42+05:30 IST

మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఉన్న ఒక దర్గా. మంజునాథేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తోంది.

శివ భక్తులకు ఆహారం అందిస్తున్న దర్గా

మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఉన్న ఒక దర్గా. మంజునాథేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తోంది. దక్షిణ కర్ణాటక, ధర్మస్థలలోని పురాతన మంజునాథేశ్వర స్వామి దేవాలయానికి ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు. చాలామంది వందల కిలోమీటర్లు ప్రయాణించి కాలినడకన దేవాలయానికి చేరుకుంటారు. ధర్మస్థల వెళ్లడానికి ఉన్నరెండు ప్రధాన మార్గాల్లో హస్సాన్ జిల్లాలో ఉన్న షిరాడి ఘాట్‌ ఒకటి. భక్తులు ఈ ఘాట్‌ను దాటి ధర్మస్థల చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం గుండా కాలినడకన వచ్చే భక్తులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆహారం, నీళ్లు వంటివి అందిస్తుంటారు. ఇదే కోవలో సకలేష్‌పూర్‌ పరిధిలోని మంజ్రాబాద్ దర్గా కూడా శివ భక్తులకు సేవ చేస్తోంది. బెంగళూరు-మంగళూరు హైవేలో ఉన్న ఈ దర్గా భక్తులకు ఆహారం, డ్రింక్స్, వసతి అందిస్తోంది. మంగళవారం శివరాత్రి సందర్భంగా ధర్మస్థల వెళ్తున్న భక్తులకు ఈ సేవలను అందిస్తున్నట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది కూడా ఇలాగే సేవలందించారు. 

Updated Date - 2022-03-01T00:03:42+05:30 IST