Jul 28 2021 @ 16:23PM

డేనియ‌ల్ క్రెయిగ్ వ‌దులుకున్న బాలీవుడ్ సినిమా ఏదో తెలుసా?

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే యాక్ష‌న్ సినిమాల్లో జేమ్స్ బాండ్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉంటాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జేమ్స్ బాండ్ పాత్ర‌ధారులుగా చాలా మంది న‌టించారు. వారిలో డేనియ‌ల్ క్రెయిగ్ ఒక‌రు. నిజానికి డేనియ‌ల్ జేమ్స్ బాండ్‌గా న‌టించ‌డం కంటే ముందే ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించాల్సింది. కానీ కుద‌ర‌లేదు. ఇంత‌కీ డేనియ‌ల్ వ‌దులుకున్న బాలీవుడ్ సినిమా ఏదో తెలుసా! .. ‘రంగ్ దే బ‌సంతి’. 2006లో ఆమిర్ ఖాన్‌, సిద్ధార్థ్ త‌దిత‌రుల‌తో రాకేశ్ ఓంప్ర‌కాశ్ మెహ్రా చేసిన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్నే ద‌క్కించుకుంది. 

‘రంగ్ దే బ‌సంతి’ చిత్రంలో జైల‌ర్ పాత్ర‌లో న‌టించిన మెక్ కిన్‌లే పాత్ర కోసం రాకేశ్ మెహ్రా చాలా మంది విదేవీ ఆర్టిస్టుల‌ను ఆడిష‌న్ చేశారు. అందులో డేనియ‌ల్ క్రెయిగ్ అయితే త‌న పాత్ర‌కు సూట్ అవుతాడ‌ని కూడా భావించాడు. కానీ  డేనియ‌ల్ క్రెయిగ్‌కు జేమ్స్ బాండ్‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కింది. అందువ‌ల్ల కొన్ని రోజుల వ్య‌వ‌ధి కావాల‌ని రాకేశ్‌ను రిక్వెస్ట్ చేశాడ‌ట‌. కానీ వీలు కాక‌పోవ‌డంతో ‘రంగ్ దే బసంతి’లో డేనియ‌ల్ క్రెయిగ్ న‌టించ‌లేదు. ఈ విష‌యాల‌ను డైరెక్ట‌ర్ రాకేశ్ ఓం ప్ర‌కాశ్ మెహ్రా త‌న ఆటో బ‌యోగ్ర‌ఫీ ‘ది స్ట్రెంజ‌ర్ ఇన్ ది మిర్ర‌ర్‌’లో తెలియ‌జేశారు.