ప్రమాదకరంగా భారీ వృక్షం

ABN , First Publish Date - 2020-10-01T08:35:49+05:30 IST

మండలంలోని కొమరగిరిపట్నం ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో ఓ భారీ వృక్షం ఎండిపోయి కూలడానికి సిద్ధంగా ఉంది. సాయిబాబా గుడి సమీపంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన

ప్రమాదకరంగా భారీ వృక్షం

 అల్లవరం, సెప్టెంబరు 30: మండలంలోని కొమరగిరిపట్నం ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో ఓ భారీ వృక్షం  ఎండిపోయి  కూలడానికి సిద్ధంగా ఉంది. సాయిబాబా గుడి సమీపంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి చెంత 90ఏళ్లనాటి నిద్రగన్నేరు భారీవృక్షం ఎండిపోయింది. 


ప్రక్కనే విద్యుత్‌స్తంభాల లైన్లు, నివాసగృహాలు ఉండడంతో  ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న ఈవృక్షాన్ని తొలగించాలని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు, పంచాయతీ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2020-10-01T08:35:49+05:30 IST