జూనియర్ కళాశాల ఆవరణలో హతమైన రక్త పింజర పాములు
రక్తపింజర పాములను హతమార్చిన స్థానికులు
జీలుగుమిల్లి, జనవరి 17: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో రక్తపింజర (రక్తపొడ) పాములు స్థానికుల చేతిలో హతమయ్యాయి. సంక్రాంతి సెలవులు అనంతరం సోమవారం కళాశాల తెరిచేందుకు వచ్చిన అధ్యాపకుల్లో ఒకరికి రెండు రక్త పొడ పాములు కనిపించాయి. స్థానికులకు తెలియజేయడంతో వాటిని హతమార్చారు. మన్యం ప్రాంతంలో అత్యంత ప్రమాదకర జాతికి చెందిన రక్త పింజర పాములు కనిపించడం అరుదని గిరిజనులు చెబుతున్నారు.