స్కూటీలోకి దూరిన పాము.. నీళ్లు పోసినా కానరాని ఫలితం.. చివరకు ఎలా బయటకు తీశారంటే..

ABN , First Publish Date - 2021-10-11T21:04:21+05:30 IST

స్కూటీని పార్క్ చేసి, ఓ పని మీద వెళ్లిన వ్యక్తికి ఎరుపు వర్ణంలో ఉన్న పాము షాకిచ్చింది. విషయం తెలిసి ఆ స్కూటీ యజమాని పామును బటయకు రప్పించడానికి నానా తంటాలు పడ్డాడు. దాన్ని బయటకు రప్పించడానికి నీళ్లు పోసినా ఫలితం లేకపోవడంతో.

స్కూటీలోకి దూరిన పాము.. నీళ్లు పోసినా కానరాని ఫలితం.. చివరకు ఎలా బయటకు తీశారంటే..

ఇంటర్నెట్ డెస్క్: స్కూటీని పార్క్ చేసి, ఓ పని మీద వెళ్లిన వ్యక్తికి ఎరుపు వర్ణంలో ఉన్న పాము షాకిచ్చింది. విషయం తెలిసి ఆ స్కూటీ యజమాని పామును బటయకు రప్పించడానికి నానా  తంటాలు పడ్డాడు. దాన్ని బయటకు రప్పించడానికి నీళ్లు పోసినా ఫలితం లేకపోవడంతో.. చివరకు ఆయన రెస్క్యూ టీంను ఆశ్రయించాల్సి వచ్చింది. కాగా.. స్కూటీలో నక్కిన పామును రెస్క్యూ టీం ఎలా బయటకు రప్పించారనే వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌‌లోని హోషంగబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పని మీద దగ్గరలోని ఇంటర్నెట్‌ షాపునకు వెళ్లారు. ఈ క్రమంలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏం కానీ.. ఎరుపు రంగులో ఉన్న పాము సరాసరి స్యూటీలోకి దూరింది. దీన్ని అక్కడే ఉన్న విద్యార్థి గమనించి.. విషయాన్ని సదరు స్కూటీ యజమానికి చెప్పాడు. దీంతో అతడు స్కూటీ దగ్గరకు చేరుకుని.. ఆ పామును బయటకు రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. స్కూటీని వాటర్‌తో వాష్ చేస్తే అయినా అది బయటికి వస్తుందేమో అని ఆ పనీ చేశాడు. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో చేసేదేం లేక.. రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు. దీంతో విరేంద్ర సులేఖియా నాయకత్వంలో అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీం.. స్కూటీ పార్టులు అన్నీ ఊడదీసి, సుమారు రెండు గంటలపాటు శ్రమించి దాన్ని బయటకు తీశారు. విషపూరితమైన ఆ మూడు అడుగుల పామును బంధించి.. సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు.


Updated Date - 2021-10-11T21:04:21+05:30 IST