విద్యార్థిని స్కూలు బ్యాగులో ఏదో కదలిక... జిప్ తీసిన ఉపాధ్యాయుడు ఒక్క ఉదుటన వెనక్కు జరిగాడు... కారణమిదే!

ABN , First Publish Date - 2022-09-25T15:36:20+05:30 IST

వర్షాకాలంలో పాములు, తేళ్లు మొదలైనవి...

విద్యార్థిని స్కూలు బ్యాగులో ఏదో కదలిక... జిప్ తీసిన ఉపాధ్యాయుడు ఒక్క ఉదుటన వెనక్కు జరిగాడు... కారణమిదే!

వర్షాకాలంలో పాములు, తేళ్లు మొదలైనవి ఇళ్లలోనికి ప్రవేశిస్తుంటాయి. అవి ఏదో మూలన నక్కి ఉంటాయి. అవి బయటకు వచ్చి, ఇంట్లోనివారిని బెంబేలెత్తిస్తుంటాయి. ఈ కోవలోని వచ్చే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒక స్కూలు విద్యార్థిని బ్యాగులో ఏదో కదులుతోంది. అది ఏమిటో చూద్దామని బ్యాగు జిప్ తీసి చూసిన ఉపాధ్యాయునికి ప్రాణాలు పోయినంత పనయ్యింది.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో @Karan4BJP అనే ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ అయ్యింది. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది. ఒక విద్యార్థిని స్కూలుకు రాగానే బ్యాగులో ఏదో కదులుతున్నట్లు ఆమెకు అనిపించింది. వెంటనే ఆ విషయాన్ని ఆమె ఒక ఉపాధ్యాయునికి తెలియజేసింది. దీంతో ఆ ఉపాధ్యాయుడు ఆ బ్యాగును బయటకు తీసుకువచ్చి, జాగ్రత్తగా ఓపెన్ చేశారు. లోపల ఏముందో చూడగానే అతనికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఒకపాము ఆ బ్యాగులో నక్కివుంది. అతికష్టం మీద ఆ ఉపాధ్యాయుడు ఆ పామును బయటకు వెళ్లగొట్టారు. ఒక నిముషం 34 సెకెన్లున్న ఈ వీడియోను చూసిన వారంతా ఆ పామును చూసి ‘అయ్యబాబోయ్’ అనుకుంటున్నారు.

Updated Date - 2022-09-25T15:36:20+05:30 IST