Viral Video: మీటరు పొడవున్న నల్లటి పాము.. ఒంటిపై పారుతుంటే.. ఈ చిన్నారి ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్!

ABN , First Publish Date - 2022-08-04T19:42:40+05:30 IST

ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాకుండా ఆ అమ్మాయి ధైర్యానికి ఫిదా అవుతున్నారు. ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చే

Viral Video: మీటరు పొడవున్న నల్లటి పాము.. ఒంటిపై పారుతుంటే.. ఈ చిన్నారి ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాకుండా ఆ అమ్మాయి ధైర్యానికి ఫిదా అవుతున్నారు. ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ పాము ఒంటిపై పారుతుంటే ఆ చిన్నారి ఏం చేసిందనే పూర్తి వివరాల్లోకి వెళితే...



పాములను(Snakes) చూస్తే సాధారణంగా ఎవ్వరైన భయపడతారు. ఆమడ దూరం పరుగులు కూడా తీస్తారు. కానీ చిన్నారి మాత్రం పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. చిన్నారి నేలపై పడుకుని ఉండగా.. సుమారు మీటరు పొడవున్న నల్లటి పాము(black snake).. ఆమె పాదల దగ్గర నుంచి ఒంటిపైకి చేరుకుంది. శరీరంపై పాము పారుతున్న విషయం ఆ చిన్నారి(girl child)కి కూడా తెలుసు. అయినా ఆ చిన్నారి ఏ మాత్రం భయపడలేదు. పైగా నవ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఆ దృశ్యాలను ఓ వ్యక్తి చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో(social media) అప్‌లోడ్ చేశాడు. దీంతో అదికాస్తా వైరల్‌(viral)గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి చూపిన ధైర్యాన్ని కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరేమో.. ‘పామును ఆ అమ్మాయి పెంచుకుంటుంది కాబోలు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-08-04T19:42:40+05:30 IST