ప్రమాదకరంగా ఆలేరు- జీడికల్‌ రోడ్డు

ABN , First Publish Date - 2022-08-05T05:45:15+05:30 IST

ఆలేరు నుంచి జీడికల్‌ మార్గం గుండా మోత్కూర్‌, సూర్యాపేటకు వెళ్లే ఈ దారి ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది.

ప్రమాదకరంగా ఆలేరు- జీడికల్‌ రోడ్డు
శారాజీపేటలో నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయిన రోడ్డు మార్గం




ఆలేరు రూరల్‌, ఆగస్టు 4:  ఆలేరు నుంచి జీడికల్‌ మార్గం గుండా మోత్కూర్‌, సూర్యాపేటకు వెళ్లే ఈ దారి ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. డబుల్‌ రోడ్డు మార్గంగా ఉన్న ఈ రోడ్డు శారాజీపేటలోని అడ్లూరు చెరువు అలుగు పోయడంతో పూర్తిగా దెబ్బతిన్నది. గత సంవత్సరం చేపట్టిన ఈ రోడ్డును విస్తరణ నాసిరకంగా ఉండడంతో నీటి ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయింది. వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని గ్రామస్థులతో పాటు ప్రయాణికులు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-05T05:45:15+05:30 IST