వేపాకుతో చుండ్రు దూరం

ABN , First Publish Date - 2021-07-15T17:48:55+05:30 IST

చుండ్రును వదిలించుకోవడానికి రకరకాల షాంపూలు వాడతారు. కానీ వేపాకుతో సులభంగా చుండ్రును దూరం చేసుకోవచ్చు.

వేపాకుతో చుండ్రు దూరం

ఆంధ్రజ్యోతి(15-07-2021)

చుండ్రును వదిలించుకోవడానికి రకరకాల షాంపూలు వాడతారు. కానీ వేపాకుతో సులభంగా చుండ్రును దూరం చేసుకోవచ్చు. 


ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో కాసిన్ని వేపాకులు వేసి వేడి చేయాలి. తరువాత నాలుగైదు చుక్కల నిమ్మరసం వేయాలి. ఈ ఆయిల్‌ను తలపై మసాజ్‌ చేస్తూ రాసుకోవాలి. రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. 


కొన్ని వేపాకులను పేస్టుగా చేసుకోవాలి. ఒక బౌల్‌లో పెరుగు తీసుకుని అందులో వేపాకు పేస్టు వేసి తలకు పట్టించాలి. పావు గంట తరువాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌తో చుండ్రు పోవడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. 

Updated Date - 2021-07-15T17:48:55+05:30 IST