దం(డి)డగేనా..?

ABN , First Publish Date - 2022-09-26T05:54:43+05:30 IST

సుమారు రూ.400 కోట్ల వ్యయం.. మూడువేల ఎకరాలకు సాగునీరు.. ఇదీ దండివాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ లక్ష్యం. అయితే ఈ పథకం నేడు నిరుపయోగంగా మారింది.

దం(డి)డగేనా..?
దండివాగు ఎత్తిపోతల పథకం వద్ద అమర్చిన మోట ార్లు

దండివాగు లక్ష్యం నిర్వీర్యం

రూ.కోట్లతో నిర్మించినా నిరుపయోగం

ఎవరికీ పట్టకుండాపోయిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌

మోరాయిస్తున్న రూ.లక్షల స్కీమ్‌ యంత్రాలు 

సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు 



దాచేపల్లి, సెప్టెంబరు 25: సుమారు రూ.400 కోట్ల వ్యయం.. మూడువేల ఎకరాలకు సాగునీరు.. ఇదీ దండివాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ లక్ష్యం. అయితే ఈ పథకం నేడు నిరుపయోగంగా మారింది. ఈ పథకం ఎవరికీ పట్టకుండా పోయింది. రూ.లక్షల విలువైన యం త్రాలు మూలన పడగా.. ఆరు తడి పంటలకు కూడా నీరు అందక ఎండిపోతున్నాయి. మండలంలోని పొం దుగుల గ్రామ శివారులో 1999లో దండి వాగుపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో వేల ఎకరాలకు నీరందించిన ఈ పథకం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మూలన పడింది. ఈ పరిస్థితుల్లో 2013లో ఆత్మగౌరవ యాత్రలో భాగంగా పొందుగులకు వచ్చిన చంద్రబాబు కు అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దండివాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పరిస్థితిని, అవసరాన్ని వివరించారు. ఈ పరిస్థితుల్లో 2017 ఫిబ్రవరిలో 3,200 ఎకరాలకు సాగు నీరు అందే విధంగా రూ.365 లక్షలు మంజూరు చేశారు. ఈ స్కీమ్‌ ద్వారా రామాపురం, శ్రీనగర్‌, పొందుగుల, శ్రీనివాసపురం, పులిపాడు, గామా లపాడు గ్రామాలకు చెందిన మూడు వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగు నీరు అందుతుంది. గతంలో ఆయా గ్రామాల ప్రజలు పూర్తిగా వర్షాధారంగా పంటలు సాగు చేసు కుంటుండేవారు. చెంతనే దిండివాగు ఉన్నా సాగునీటి కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుండే వారు. ఈ పరిస్థితుల్లో నిర్మించిన లిఫ్ట్‌ఇరిగేషన్‌ ఆయా గ్రామాల రైతులకు వరంగా మారింది. సకాలంలో సాగునీరు అందడంతో ఆయా గ్రామాల ప్రజలకు వెన్నుదన్ను గా నిలిచింది. మిర్చి, పత్తి పంటలకు ఈ పథకం ఊపిరిపోసేది. ఈ పథకం బాగు న్నప్పుడు సకాలంలో సాగునీరు అంద టంతో పంటలు పుష్కలంగా పండేవి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో దండివాగు గురించి పట్టించుకునే వారే లేకుండా పోవడంతో ఈ పథకం మూలనపడింది. రూ.కోట్లతో ఏర్పాటు చేసిన సిమెంట్‌ దోనెలను వైసీపీ నేతలు అమ్మేసుకున్నారనే ఆరోప ణలు వచ్చాయి. స్కీమ్‌ మరమ్మ తులపై అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో సాగునీరు అందక పంటలు బెట్టకు వచ్చాయి. అధికారులు స్పందించి దిండి వాగు స్కీమ్‌  మరమ్మత్తులపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-26T05:54:43+05:30 IST