20 అడుగుల ఎత్తు నుంచి కింద పడి.. విరిగిన దవడతోనే డ్యాన్స్

ABN , First Publish Date - 2020-02-12T22:16:50+05:30 IST

డ్యాన్స్ పెర్ఫామెన్స్ సందర్భంగా 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయిందా డ్యాన్సర్.

20 అడుగుల ఎత్తు నుంచి కింద పడి.. విరిగిన దవడతోనే డ్యాన్స్

డాలస్: పెర్ఫామెన్స్ సందర్భంగా 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయిందా డ్యాన్సర్. మొహానికి నేల బలంగా తాకడంతో ఆమె దవడ విరిగిపోయింది. మడమ వాచిపోయి కాలంతా భయంకరమైన నొప్పి వచ్చింది. అయినా సరే ఆమె తన పెర్ఫామెన్స్ ఆపలేదు. కింద పడిన తర్వాత కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అమెరికాలోని డాలస్‌కు చెందిన గినియా స్కై అనే స్ట్రిప్పర్.. పోల్ డ్యాన్స్ చేస్తోంది. అలా చేస్తూ పోల్‌పై 20 అడుగుల ఎత్తుకు ఎక్కింది. అక్కడ ఉండగా పట్టుతప్పి దభేలున కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె మొహం బలంగా స్టేజిని తాకింది. దీంతో ఆమె దవడ విరిగి, పళ్లు కూడా దెబ్బతిన్నాయి. అయినా ఆమె తన పెర్ఫామెన్స్ ఆపలేదు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్తే శస్త్రచికిత్స చేశారని, ప్రస్తుతం మాట్లాడటం కష్టంగా ఉందని ఆమె చెప్పింది. ఈ విషయాన్ని చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది. ఆమె వైద్య ఖర్చుల కోసం ‘గోఫండ్‌మీ’ పేజిలో విరాళాలు సేకరిస్తున్నారు.

Updated Date - 2020-02-12T22:16:50+05:30 IST