Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్యాన్స్‌ మూమెంట్‌ థెరపీతో వృద్ధులకు ఎన్నో లాభాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: డ్యాన్స్‌ మూమెంట్‌ థెరపీ ద్వారా వృద్ధుల మానసిక స్థితి మెరుగుపడుతుందని, శరీర కదలికలు బాగుంటాయని ఇజ్రాయిల్‌లోని కిబ్బుట్జిమ్‌ కళాశాల పరిశోధకులు గుర్తించారు. హైఫా వర్సిటీ పరిశోధకులతో కలిసి వీరు చేపట్టిన అధ్యయనం ఫలితాలను ఫ్రాంటియర్స్‌ ఇన్‌ జర్నల్‌ ప్రచురించింది. అధ్యయనంలో భాగంగా 16 మంది డ్యాన్స్‌ మూమెంట్‌ థెరపిస్టులు.. తమ అమ్మమ్మలతో కలిసి మూడు డ్యాన్స్‌ సెషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సెషన్స్‌ ప్రభావం ఎలా ఉంది? వృద్ధుల సమస్యలకు చికిత్స చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన విధానాలు సాధ్యమేనా? వంటి అంశాలను పరిశీలించారు. నృత్యం వల్ల వృద్ధుల మానసిక స్థితి మెరుగుపడిందని, కండరాల బలం పెరగడమే కాకుండా వారిలో ఆందోళన తగ్గిందని అధ్యయన నివేదిక రచయిత డాక్టర్‌ ఐనాట్‌ షుపర్‌ ఎంగెల్‌హార్డ్‌ వివరించారు.

Advertisement
Advertisement