Abn logo
Jan 16 2021 @ 12:03PM

`డాన్స్ రాజా డాన్స్` హిట్ కావాలి: మాజీ సీఎం రోశయ్య

ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ (నిరోష), మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం `డాన్స్ రాజా డాన్స్`. వెంకీ ఏ.ఎల్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. 


భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు. నృత్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు రోశయ్య తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement