కల్యాణ నారసింహుడు

ABN , First Publish Date - 2020-03-06T06:06:04+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోని పలు నృసింహ క్షేత్రాలు బ్రహ్మోత్సవ శోభతో అలరారుతున్నాయి. అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ వేడుకల కోసం..

కల్యాణ నారసింహుడు

తెలుగు రాష్ట్రాల్లోని పలు నృసింహ క్షేత్రాలు బ్రహ్మోత్సవ శోభతో అలరారుతున్నాయి. అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ వేడుకల కోసం ముస్తాబవుతున్నాయి. తెలంగాణలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయి. శనివారం స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలు ఈనెల 18 వరకూ కొనసాగుతాయి. 


ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని ఈ నెల ఎనిమిదో తేదీన నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 29న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 11న ముగుస్తాయి. 


ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అహోబిలంలో ఫిబ్రవరి 28న బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. వీటిలో భాగంగా మర్చి 6న ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నృసింహస్వామి, చెంచులక్ష్మి, లక్ష్మీదేవిల కల్యాణం, మార్చి 7న దిగువ అహోబలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవిల కల్యాణం నిర్వహిస్తారు. ఈ నెల 13వ వరకూ ఉత్సవాలు జరుగుతాయి.

Updated Date - 2020-03-06T06:06:04+05:30 IST