దామగుండం అడవిలో కాల్పుల కలకలం!

ABN , First Publish Date - 2020-10-25T05:39:02+05:30 IST

పూడూరుమండలం దామగుండం అడవుల్లో కాల్పుల కలకలం రేపింది. పూడూరు గ్రామానికి చెందిన రైతు డాక్యానాయక్‌ మేత కోసం ఆవులను రోజు మాదిరిగానే దామగుండం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు

దామగుండం అడవిలో కాల్పుల కలకలం!

కాల్పుల్లో ఆవు మృతి  వేటగాళ్ళ పనేనని అనుమానంఫ ఘటనా స్థలంలో బుల్లెట్లు  లభ్యం?


పరిగి/పూడూరు: పూడూరుమండలం దామగుండం అడవుల్లో కాల్పుల కలకలం రేపింది.  పూడూరు గ్రామానికి చెందిన  రైతు డాక్యానాయక్‌ మేత కోసం ఆవులను రోజు మాదిరిగానే దామగుండం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే అన్ని ఆవులు సాయం త్రం  ఇంటికి రాగా ఒక ఆవు రాకపోవడంతో శనివారం ఉదయం నుంచి వెతకగా దామగుండం అటవీ ప్రాంతంలో మృతి చెంది ఉంది. గుర్తు తెలియని దుండగులు  తుపాకితో కాల్చి చంపినట్లు రైతు అధి కారుల దృష్టికి తీసుకెళ్లాడు. అటవీ, పోలీసు శాఖ అధికారులు సంఘట స్థలాన్ని పరిశీలించగా బుల్లెట్లు లభించినట్లు సమాచారం. వేటగాళ్ళు ఇతర జంతువులను వేటాడిన తర్వాత ఆవుపై కూడా కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్నారు. 


రెండేళ్ల క్రితం మన్నెగూడ శివారులో కూడా జింకపై కాల్పులు జరిపిన ఘటన విదితమే. ఆ తర్వాత కూడా దామగుండంలో పలుమార్లు వేటగాళ్ల చేతుల్లో జంతువులు బలైన సంఘటనలు చోటుసుకున్నాయి. దామగుండం అడవిలో ఆవుపై కాల్పులు వేటగాళ్లపనేనని భావిస్తున్నామని జిల్లా ఆటవీశాఖ అధికారి వేణుమాధరావు తెలిపారు. దీనిపై  దర్యాప్తు చేస్తున్నామన్నారు. వేటగాళ్ళ కాల్పులతోనే ఆవు మృతి చెందినట్లుగా భావించి కేసు నమోదు చేశామని ఎస్పీ నారాయణ తెలిపారు. ఆవుకు పోస్టుమార్టం చేయిస్తున్నామని,  నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-10-25T05:39:02+05:30 IST