Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంగన్‌వాడీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు

రాపూరు, డిసెంబరు 5: రాపూరు అంగన్‌వాడీ కేంద్రాల్లో కుళ్లిపోయిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు ఆదివారం గుర్తించారు. బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేస్తుండగా వెలుగోను గ్రామంలో ఈ విషయం బయటపడింది.  రోజురోజుకు పౌష్టికాహారం కాస్త విషాహారంగా మారుతుందని జనం వాపోతున్నారు. సీడీపీవో షంషాద్‌ బేగం మాట్లాడుతూ కుళ్లిన గుడ్లను వెనక్కు పంపుతున్నట్లు తెలిపారు. కుళ్ళ్లి కోడిగుడ్లు గుర్తిస్తే పడేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. 

Advertisement
Advertisement