దెబ్బతిన్న కల్వర్టు

ABN , First Publish Date - 2021-06-18T05:09:42+05:30 IST

వెల్లటూరు నుంచి పొలతల వెళ్లే దారిలోని కొత్తగిరియంపల్లె కల్వర్టు దెబ్బతిని నెలలు గడుస్తోంది. దాని చుట్టూ రాళ్లు, కంప పెట్టి డేంజర్‌ అని బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప మరమ్మతులు చేసి న పాపాన పోలేదు.

దెబ్బతిన్న కల్వర్టు
మరమ్మతులకు నోచుకోని కల్వర్టు

ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు

మరమ్మతులెప్పుడో..  !

పెండ్లిమర్రి, జూన్‌ 17: వెల్లటూరు నుంచి పొలతల వెళ్లే దారిలోని కొత్తగిరియంపల్లె కల్వర్టు దెబ్బతిని నెలలు గడుస్తోంది. దాని చుట్టూ రాళ్లు, కంప పెట్టి డేంజర్‌ అని బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప మరమ్మతులు చేసి న పాపాన పోలేదు. ఈ దారిలో నిత్యం చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు వస్తుంటారు. అలాగే ప్రతి సోమవారం భక్తులు పొలతల మల్లేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇప్పటికే రాత్రిపూట చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. అయినా అధికారుల్లో చలనం లేదని, కనీస మరమ్మతులు కూడా చేయలేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని, లేదంటే నూతన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఏదేమైనా ప్రాణనష్టం జరగక ముందే చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-06-18T05:09:42+05:30 IST