కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన

ABN , First Publish Date - 2020-08-10T10:50:38+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఏఐటీయూసీ జిల్లా కార్యాదర్శి దామా అంకయ్య తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన

కావలి, ఆగస్టు 9 : కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఏఐటీయూసీ జిల్లా కార్యాదర్శి దామా అంకయ్య తెలిపారు. కావలి బ్రిడ్జిసెంటర్‌లో ఆదివారం వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కరోనా ప్రభావంతో దేశం విలవిలలాడుతుంటే   మోదీ సందట్లో సడేమియా అంటూ ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్‌ఐసీ, రైల్వే, షార్‌ తదితర సంస్థలను ప్రవేటీకరణ చేయాలనుకోవటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు కరువాది భాస్కర్‌, సీఐటీయూ నాయకులు పీ. పెంచలయ్య, సీపీఐ నాయకుడు డేగా సత్యం, స్త్రీవిముక్తి సంఘటన నాయకురాలు ఎల్‌. శ్యామల, ఏఐటీయూసీ నాయకులు మల్లె అంకయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:50:38+05:30 IST