దమ్‌ హండీ కా ఘోష్‌

ABN , First Publish Date - 2022-04-16T22:40:11+05:30 IST

రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. అయితే ఇఫ్తార్‌ విందు ఇంకాస్త స్పెషల్‌గా ఉండాలంటే ఈ వంటలు ట్రై చేయండి.

దమ్‌ హండీ కా ఘోష్‌

ఇఫ్తార్‌... ఘుమఘుమలు

రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. అయితే ఇఫ్తార్‌ విందు ఇంకాస్త స్పెషల్‌గా ఉండాలంటే ఈ వంటలు ట్రై చేయండి. ఇంట్లో అందరూ సులభంగా చేసుకోదగిన వంటలు ఇవి...


కావలసినవి: మటన్‌ స్టాక్‌ - 200గ్రా, మటన్‌ - 700గ్రా, జీడిపప్పు పేస్టు - 50గ్రా, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయలు తరిగినవి - పావుకేజీ, నూనె - 100ఎంఎల్‌, హోల్‌ గరంమసాల - 5గ్రా, టొమాటో ప్యూరీ - 350గ్రా, కారం - 15గ్రా, ధనియాల పొడి - 10గ్రా, పెరుగు - 150గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా, కొత్తిమీర - 10గ్రా, గరంమసాల పొడి - 5గ్రా.


తయారీ విధానం: స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక హోల్‌ గరంమసాల వేయాలి. మసాలా వేగిన తరువాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి.ఇప్పుడు మటన్‌ వేసి కలియబెట్టుకోవాలి. కాసేపు ఉడికిన తరువాత టొమాటో ప్యూరీ వేయాలి.మటన్‌ బాగా ఉడికి నూనెను వదిలేసిన సమయంలో గరంమసాలా పొడి, ధనియాల పొడి, కారం, పెరుగు వేసి కలుపుకోవాలి. తరువాత మటన్‌ స్టాక్‌ వేసి మరోసారి ఉడికించుకోవాలి. కాసేపయ్యాక జీడిపప్పు పేస్టు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి.మూతపెట్టి చిన్నమంటపై మటన్‌ మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి.చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2022-04-16T22:40:11+05:30 IST