Dallas shooting: ఎయిర్‌పోర్టులో కాల్పులకు తెగబడ్డ మహిళ.. వెంటనే పోలీసులు అప్రమత్తమైన..

ABN , First Publish Date - 2022-07-27T04:43:11+05:30 IST

టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్‌ నగరంలోగల డాలస్ లవ్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో సోమవారం ఓ మహిళ కాల్పులకు తెగబడింది.

Dallas shooting: ఎయిర్‌పోర్టులో కాల్పులకు తెగబడ్డ మహిళ.. వెంటనే పోలీసులు అప్రమత్తమైన..

ఎన్నారై డెస్క్: టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్‌ నగరంలోగల డాలస్ లవ్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో(Dallas love field airport) సోమవారం ఓ మహిళ కాల్పులకు(Shooting) తెగబడింది. టికెట్‌ కౌంటర్ వద్ద ఆమె అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులకు దిగింది. దీంతో.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఒకరు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఆమెకు శరీరం దిగువ భాగంలో గాయవడంతో పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఉదయం సుమారం 11 గంటలకు ఈ ఘటన జరిగింది. ఎయిర్‌పోర్టులోకి వచ్చిన నిందితురాలు మొదట వాష్‌రూంలోకి దుస్తులు మార్చుని బయటకు వచ్చి కాల్పులకు తెగబడిందని పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. సీలింగ్‌వైపు తుపాకీ గురిపెట్టి ఆమె కాల్పులకు దిగిందని సమాచారం. అయితే.. ఈ ఘటనలో నిందితురాలు మినహా ఇతరులెవ్వరూ గాయపడలేదు. నిందితురాలు ఎందుకు కాల్పులు జరిపిందో ఇంకా తెలియరాలేదు. అయితే..గతంలోనూ ఆమెపై పోలీసు కేసు నమోదైనట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-07-27T04:43:11+05:30 IST