దళితులు ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-07-02T05:12:23+05:30 IST

దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

దళితులు ఆర్థికంగా ఎదగాలి
సీఎం సహాయ నిధి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి

- ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి

- లబ్ధిదారులకు ‘దళితబంధు’ వాహనాలు పంపిణీ

నారాయణపేట టౌన్‌, జూలై 1 : దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ‘దళితబంధు’ పథకంలో మంజూరైన ట్రాక్టర్‌, షిప్ట్‌ డిజైర్‌ కారును లింగారెడ్డిపల్లి, భైరం కొండ లబ్ధిదారులకు అందజేశారు. ప్రతీ లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పట్టణానికి చెందిన మానస రూ.60 వేలు, హఫీజా బేగం రూ.60 వేలు, వెంకటేష్‌ రూ.48 వేలు, ఫైజుద్దిన్‌ రూ.26 వేలు, మెహవిష్‌ రూ.24,500 మంజూరు కాగా ఎమ్మెల్యే అందజేశారు.

స్టడీ మెటీరియల్‌ పంపిణీ 

జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు కొనసాగుతున్న ఉచిత శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి విద్యా ర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే తన కార్యాలయం లో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేయడంతో అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లు, శిక్షణ శిబిరం నిర్వాహకులు పాల్గొన్నారు.

రైతు బీమా చెక్కులు పంపిణీ

మరికల్‌ : మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన మంగళి మురళి, మంగళి కుర్మన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వీరికి మంజూరైన రూ.5 లక్షల రైతు బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజు, ఉప సర్పంచ్‌ రాజేశ్వర్‌రెడ్డి, గాదం మల్లేష్‌, నరహరి, సత్యారెడ్డి, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:12:23+05:30 IST