భూములు లాక్కోవద్దంటూ దళితుల నిరసన

ABN , First Publish Date - 2022-07-01T04:53:13+05:30 IST

ఇందిరమ్మ పథకం కింద ఇచ్చిన భూములు లాక్కోవద్దం టూ కొర్విచెల్ల గ్రామానికి చెందిన దళితులు గురువారం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిర సన చేపట్టారు. తమకు కేటాయించిన ఇంటి స్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాం గణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకు న్నారు. పలువురు దళితులు మాట్లాడుతూ కొర్విచెల్మ శివారులోని సర్వే నెంబర్‌ 139లో 6ఎకరాల 24 గుంటల భూమిలో 75మంది దళితుల కుటుంబాలకు 42 ఏళ్ళ క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించింది.

భూములు లాక్కోవద్దంటూ దళితుల నిరసన
మాట్లాడుతున్న తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్సై.

దండేపల్లి, జూన్‌ 30: ఇందిరమ్మ పథకం కింద ఇచ్చిన భూములు లాక్కోవద్దం టూ కొర్విచెల్ల గ్రామానికి చెందిన దళితులు గురువారం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిర సన చేపట్టారు. తమకు కేటాయించిన ఇంటి స్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాం గణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకు న్నారు.  పలువురు దళితులు మాట్లాడుతూ కొర్విచెల్మ  శివారులోని సర్వే నెంబర్‌ 139లో 6ఎకరాల 24 గుంటల భూమిలో 75మంది దళితుల కుటుంబాలకు 42 ఏళ్ళ క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించింది. ఇచ్చిన స్థలంలో  ఇండ్లు కట్టుకొని ఉన్నప్పటికీ రోడ్డు,  కనీస వసతులు లేక ఊళ్లలోకి వచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం ప్రతి ఊరిలో ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అధికారులు దళితులకు ఇచ్చిన భూమిని చదును చేసేందుకు ఎక్స్‌ కావేటర్‌తో వచ్చారు. దళిత మహిళలు అడ్డుకొని తమకు పంపిణీ చేసిన భూమిని లాక్కోవద్దని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన చేశారు. తహసీల్దార్‌ హన్మంతరావు, ఎంపీడీవో మల్లేశం, ఎస్సై సాంబమూర్తి చేరుకొని నచ్చజేప్సే ప్రయత్నం చేశారు.  భూములను లాక్కుంటే వాటర్‌ట్యాంక్‌పై నుంచి దూకుతామని హెచ్చరించారు. విషయాన్ని జిల్లా అధికారులకు నివేదిస్తామని అధికారులు వెనుతిరిగి వెళ్ళారు.

 

Updated Date - 2022-07-01T04:53:13+05:30 IST