దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ABN , First Publish Date - 2022-05-21T06:33:28+05:30 IST

దళితులు ఆర్థిక అభివృద్ధి సాధించి సమాజంలో ఉ న్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ ఆకాక్షించారు.

దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
వాహన లబ్ధిదారులకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ 

దేవరకొండ, మే 20: దళితులు ఆర్థిక అభివృద్ధి సాధించి సమాజంలో ఉ న్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ ఆకాక్షించారు. దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పీఏపల్లి మండలం రోళ్లకల్లు, పుట్టంగండి గ్రామాలకు చెందిన దళితబంధు లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బడుగు, బలహీ న వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తుందన్నారు. అం బేడ్కర్‌ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నాడని అన్నారు. దళితబంధు పథకం కింద ఎంపిక చేసిన దళితులందరికీ ఒక్కొక్కరికి బ్యాంకు ఖాతా లో నేరుగా రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. లబ్ధిదారులకు మంజూరైన 17 మందికి 11 ట్రాక్టర్లు, 4 కార్లు, 2 బొలోరో వాహనాలను దేవరకొండ ఆర్డీవో గోపిరాంతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమం లో పీఏపల్లి ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన వల్లపురెడ్డి, వైస్‌ఎంపీపీ సరిత నర్సింహ, సర్పంచులు లక్ష్మమ్మ, భీమానాయక్‌, నరేందర్‌, సుజాత రా ములు, అధికారులు పాల్గొన్నారు. 

చింతపల్లి: సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలకేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత కంకణాల వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ కంకనాల ప్రవీణ, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-21T06:33:28+05:30 IST