దళితులకు దగా

ABN , First Publish Date - 2021-12-07T07:28:42+05:30 IST

అంబేడ్కర్‌ స్మృతివనంపై అవమానాలు.. బాబుపై అక్కసుతో అమరావతిలో బ్రేక్‌చంద్రబాబు తన హయాంలో ...

దళితులకు దగా

అంబేడ్కర్‌ స్మృతివనంపై అవమానాలు.. బాబుపై అక్కసుతో అమరావతిలో బ్రేక్‌చంద్రబాబు తన హయాంలో అమరావతిలో తలపెట్టిన అంబేడ్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు జగన్‌ అధికారంలోకి రాగానే నిలిచిపోయింది. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్‌ మైదానంలో అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేస్తామని ఈ ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసింది. అంబేడ్కర్‌ మహా నిర్యాణదినం డిసెంబరు ఆరు ఈ ఏడాది కూడా వచ్చింది.. వెళ్లింది. కానీ, ఇప్పటికీ అంబేడ్కర్‌ ప్రాజెక్టు ఒక్క అడుగూ ముందుకు కదలలేదు


 వైసీపీ వచ్చిరాగానే ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వీర్యం

 టీడీపీ హయాంలో ఎస్సీవిద్యకు పెద్దపీట

 కార్పొరేట్‌, బెస్ట్‌ స్కూళ్లల్లో విద్యాభ్యాసం

 ప్రభుత్వ బడులు చాలునని వాటికి స్వస్తి

 నవరత్నాలంటూ ప్రత్యేక స్కీమ్‌లన్నీ రద్దు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దళితుడు దగాపడ్డాడు. జగనన్న ప్రభుత్వం లో ఎస్సీల ఆత్మగౌరవం ఆపదలో పడింది. కక్ష కట్టినట్టు రాష్ట్రంలో ఎస్సీలకు అందాల్సిన సంక్షేమ ఫలాలకు చెక్‌ పెట్టారు. అన్నీ వర్గాలతో పాటు నవరత్నాలు అందడం తప్ప ఎస్సీలకు ప్రత్యేకం గా అందాల్సిన ఫలాలు అందివ్వడం లేదు. సబ్‌ప్లాన్‌ లాంటి నిధుల కేటాయింపులకు కూడా కొత్త భాష్యం చెప్పి ఎస్సీల అభివృద్ధికి పాతరేశారని విమర్శిస్తున్నారు. దళితుల కోసం ఫలానా సంక్షేమం చేశామని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడి ందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంబేడ్కర్‌ స్మృతివనం, విగ్రహం కోసం శంకుస్థాపన చేసినరోజు కనిపించిన హడావుడి.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నడిబొడ్డున ఎస్సీ నియోజకవర్గం శాకమూరులో స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 20 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, పార్క్‌, బుద్ధధ్యాన కేంద్రం, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. తొలివిడతగా రూ.97.69 కోట్లు మంజూరు చేశారు. పనులు కూడా ప్రారంభమయి 22ు పూర్తయ్యా యి. ఇంతలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ఆపేశారు. రాజధాని అమరావతికి బదులుగా మూడు రాజధానులు తెరపైకి తీసుకురావడం, అంబేడ్కర్‌ స్మృతివనం కొనసాగించరాదన్న అక్కసుతో విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో అంబేద్కర్‌ విగ్రహంతో పాటు పార్కు నిర్మిస్తామని ఆర్భా టం చేశారు. గత ఏడాది వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్‌ స్మృతివనంగా విజయవాడలోని స్వరాజ్‌మైదానం పేరు మార్చాలని నిర్ణయించింది. ఏడాది పూర్తవుతున్నా.. పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కొత్త ప్రభుత్వమొస్తే కొత్త పథకాలు తెస్తారనుకుంటే.. ఉన్న పథకాలను రద్దు చేశారనే భావన అన్ని వర్గాలతోపాటు దళితుల్లోనూ గూడుకట్టుకుంది. ఎస్సీ యువత కోసం ఉద్దేశించిన స్వయం ఉపాధి పథకాలను మూసేశారు. విదేశీ చదువులకు వెళ్లాలనుకున్న పేద విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఎస్సీలకు ప్రయోజనాలు కల్పిస్తున్న కార్పొరేషన్‌కు రూపాయి రాల్చకుండా ఎండబెట్టారు. నవరత్నాలంటూ దళితులకు అ నాదిగా కొనసాగిస్తున్న  పథకాలకు స్వస్తి చెప్పారు. 


స్వయం ఉపాధి పథకాలకు స్వస్తి....

గత ప్రభుత్వంలో ఏటా వందలాది మంది ఎస్సీ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేసుకునేది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వీరికోసం ఏటా సుమారు రూ.400 కోట్ల దాకా ఖర్చు చేసేవారు. 60 శాతం సబ్సిడీ అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా డ్రైవింగ్‌ వృత్తిలో ఉన్న యువతకు రుణమిప్పించడం ద్వారా ఇన్నోవా కార్లు అందజేశారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పలు యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి సహకారమందించింది. ఒక్కో యువకుడికి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల దాకా రుణసాయం అందించేందుకు బ్యాంకుల ద్వారా సహకారమందించింది. దీంతో పాటు బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంతమందికి ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీఎస్‌ సహకారంతో నేరుగా ప్రభుత్వమే రుణాలందించింది. విదేశాల్లో చదవాలనుకున్న ఎస్సీ యువతకు చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. విదేశాల్లో ప్రముఖ వర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ యువతకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. తర్వాత మరో రూ.5 లక్షలు పెంచి 15 లక్షలను మంజూరుచేసింది. దీంతో వందల మంది ఎస్సీ యువత విదేశాల్లో చదువుకున్నా రు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలతో పా టు సివిల్‌ సర్వీ్‌సకు ప్రిపేరయ్యేందుకు అవసరమయ్యే శిక్షణ కూడా విద్యోన్నతి పథకం ద్వారా అందేది. ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర ప్రముఖ నగరాల్లో బెస్ట్‌ కోచింగ్‌ సెంటర్లలో వీరికి శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు విదేశీ విద్య, విద్యోన్నతి పథకాలను అటకెక్కించారు. 


ఇక్కడా మూడు ముక్కలే.. 

రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్‌ కల్పతరువు లాంటిది. పలు పథకాలు ఈ కార్పొరేషన్‌ ద్వారా అందించేవారు. ఎస్సీ కార్పొరేషన్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వా త చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి పథకాలతో పాటు చిన్నతరహా వ్యవసాయానికి సంబంధించి ఎస్సీ రైతులకు సహాయ సహకారాలందించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వెట్టి, జోగినులకు పునరావాస కార్యక్రమాలు, పొలాల్లో బోర్లు, పంపుసెట్లు, విద్యుత్‌ సౌకర్యం, భూమి అభివృద్ధి, భూమి లేని పేదలకు భూములు కొనివ్వడం, ఇంటి స్థలాల ను కొనుగోలు చేసి ఇవ్వడం, ఎస్సీలకు వడ్డీ లేని రుణాలు, ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీఎస్‌, ఎన్‌ఎ్‌సకేఎ్‌ఫడీఎస్‌ లాంటి పథకాల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లుకు రుణాలివ్వడం తదితర పలు కార్యక్రమా లు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందేవి. జగన్‌ ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించి చైర్మన్లును మాత్రం నియమించింది. ఈ కార్పొరేషన్ల ద్వారా ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదు.


‘బెస్ట్‌’ ఎందుకులే అని..

మెరికల్లాంటి ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్‌ చదువులను కళాశాలలను చేరువ చేయాలని గత ప్రభుత్వం తెచ్చిందే బెస్ట్‌ అవైలబుల్‌ విధా నం. ఈ విధానంలో కార్పొరేట్‌ కళాశాలలకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించేది. జిల్లాల కలెక్టర్ల ద్వారా ఎంపిక జాబితా తయారుచేసి ఏటా వేల మంది విద్యార్థులను కార్పొరేట్‌ కళాశాలలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ల్లో అడ్మిషన్లు కల్పించేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిరాగానే ఈ పథకంతో పనిలేదని తేల్చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేశామని, ఇక ఎస్సీలకు కార్పొరేట్‌ విద్య అవసరం లేదంటూ బెస్ట్‌ అవైలబుల్‌, కార్పొరేట్‌ కళాశాలల అడ్మిషన్లకు స్వస్తి పలికింది. ఎస్సీ హాస్టళ్ల ను రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మార్చేందుకు చం ద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ ప్రక్రి య మధ్యలో ఉండగానే కొత్త ప్రభుత్వం వచ్చిం ది. ఆ ప్రక్రియను ఎక్కడికక్కడే ఆపేయడంతో  ఆయా హాస్టళ్లలో చదివే విద్యార్థులు త్రిశంకుస్వర్గంలో పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో రూ.1100 కోట్లకు చేరిన సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ బడ్జెట్‌ను రూ.700 కోట్లకు కుదించారు. ఈ దెబ్బ ఎస్సీ విద్యార్థులకు లభిస్తున్న పోషకాహారంపై పడింది. గత ప్రభుత్వంలో ఎస్సీల అభివృద్ధి కోసం మంజూరుచేసిన వందల కోట్ల పనులను జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసింది.

Updated Date - 2021-12-07T07:28:42+05:30 IST