దళితుల అభ్యున్నతి కోసమే ‘దళితబంధు’

ABN , First Publish Date - 2022-08-17T04:46:32+05:30 IST

దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు

దళితుల అభ్యున్నతి కోసమే ‘దళితబంధు’
లబ్ధిదారుడికి వాహనం తాళం చెవిని అందిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల క్రైం, ఆగస్టు 16 : దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గట్టు మండలం అలూరుకు చెందిన దళితబంధు పథకం లబ్ధిదారుడు రాజుకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొలెరో వాహనాన్ని అందించారు. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్‌గౌడు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌ బాబు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


బాధిత కుటుంబానికి పరామర్శ

  గట్టు : మండల పరిదిలోని చాగదోణ గ్రామానికి చెందిన ఆంజనేయులు ఉరుకుంద ఈరణ్ణ స్వామి దర్శనానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తూ కారు డీ కొనడంతో మృతి చెందాడు. మంగళవారం ఆయన మృతదేహనికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమొహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట టీఅర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు జంబురామన్‌గౌడు, ఎంపీపీ విజయ్‌, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బల్గెర హనుమంతునాయుడు ఆంజనేయులుకు నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


జములమ్మ కల్యాణోత్సవానికి ఆహ్వానం

గద్వాల : జములమ్మ కల్యాణోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ఈవో కవిత ఆహ్మానించారు. చైర్మన్‌ కుర్వ సతీష్‌కుమార్‌తో కలిసి ఆమె మంగళవారం గద్వాల పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేకు ఆహ్వానపత్రికను అందించారు. ఈ నెల 23న నిర్వహించనున్న కల్యాణోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను ఆయనకు వివరించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లి చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌కు ఆహ్వానపత్రికను అందించారు. ఉత్సవాల సందర్భంగా పారిశుధ్య నిర్వహణకు మునిసిపల్‌ కార్మికులను కేటాయించాలని కోరారు. వారి వెంట పాలకవర్గ సభ్యుడు మేడికొండ జానకిరాములు, మాధవికాంమ్లే, ఆలయ ఉద్యోగులు మురళీధర్‌రెడ్డి, సంజీవరెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-08-17T04:46:32+05:30 IST