ఆర్థికాభివృద్ధికే దళితబంధు : సక్కు

ABN , First Publish Date - 2022-05-18T05:35:40+05:30 IST

దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

ఆర్థికాభివృద్ధికే దళితబంధు : సక్కు

నార్నూర్‌, మే 17 : దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం నార్నూర్‌, గాదిగూడ మండలాల్లోని గంగాపూర్‌, ఖడ్కి గ్రా మాల్లో దళిత బంధు పథకం కింద ఎంపికైన 23 మంది లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌తో కలిసి వివిధ రకాల వాహనాలను అంద జేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దళితబంధు పథకం ద్వారా అందించిన వాహనాలు ఇతర యూనిట్లను సరైన పద్ధతిలో వినియోగించుకుని ఆర్థికంగా లాభాలు పొందాలన్నారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని  సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అన్నారు. కార్యక్రమలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ ఉర్వేత రూప్‌దేవ్‌, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ శంకర్‌,  ఎంపీడీవో రమేష్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌, నాయకులు దుర్గే మహేందర్‌, కాంతారావు, రాథోడ్‌ రమేష్‌, సయ్యద్‌ ఖాసీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:35:40+05:30 IST