Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళిత, గిరిజనులు ఐక్యంగా ఉద్యమించాలి

ఆసియా దళిత హక్కుల ఫోరం చైర్మన్‌ పాల్‌దివాకర్‌ 

గుంటూరు, అక్టోబరు 26: అంబేద్కర్‌ స్ఫూర్తితో బడ్జెట్‌లో న్యాయమైన వాటా పొందేందుకు దళిత, గిరిజనులు సమైక్యంగా ఉద్యమించాలని ఆసియా దళిత హక్కుల ఫోరం చైర్మన్‌ ఎన్‌.పాల్‌ దివాకర్‌ పిలుపునిచ్చారు. దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ రాష్ట్ర కార్యదర్శి అల్లడి దేవకుమార్‌  అఽధ్యక్షతన అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రీ బడ్జెట్‌ కన్సల్టేషన్‌లో ఆయన ప్రసంగించారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి అవసరమైన వనరులను అందించకుండా బలహీనులుగా ప్రభుత్వాలు మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ రాజనీతి విభాగం ఆచార్యులు ఎన్‌.సుకుమార్‌, దళితసీ్త్ర శక్తి కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ, దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్‌ ప్రసంగించారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చిట్టిబాబు, అనిల్‌కుమార్‌, రమణమూర్తి, డాక్టర్‌ నాగరాజు తదితరులున్నారు. 

   

Advertisement
Advertisement