దళిత బంధు లబ్ధిదారులకు వాహనాల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-03T23:42:27+05:30 IST

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నాడు దళితబంధు కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన 4 కోట్ల 81 లక్షల 49 వేల రూపాయల విలువైన వాహనాలను కమలాపూర్ మండలం లోని 51 మంది షెడ్యూల్ కులాల

దళిత బంధు లబ్ధిదారులకు వాహనాల పంపిణీ

హన్మకొండ: జిల్లా కలెక్టరేట్  కార్యాలయంలో గురువారం నాడు దళితబంధు కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన 4 కోట్ల 81 లక్షల 49 వేల రూపాయల విలువైన వాహనాలను  కమలాపూర్ మండలం లోని 51 మంది షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు  రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర షెడ్యూలు కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ  మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పంపిణీ చేసారు. అందులో భాగంగా 10 హార్వెస్టర్లు, రెండు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, ఒక ఆటో ట్రాలీ, రెండు బొలోరో వాహనాలు, ఒక జెసిబి, 16 ట్రాక్టర్లు& రోటా వేటర్లు, 2 ట్రాక్టర్లు, ట్రాలీలు లబ్ధిదారులకు అందజేశారు.


ఈ పంపిణి కార్యక్రమంలో  వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, శ్రీధర్ బాబు, జెడ్పి చైర్మన్లు గండ్ర జ్యోతి, సుదీర్ కుమార్,  రాష్ట్ర షెడ్యూల కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి కమిషనర్ విజయ్ కుమార్, జిల్లా  కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, గోపి, శివ లింగయ్య, శశాంక, రూపేష్ మిశ్రా,  ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-03T23:42:27+05:30 IST