‘దళిత,గిరిజన సదస్సును విజయవంతం చేయాలి’

ABN , First Publish Date - 2021-09-17T06:03:16+05:30 IST

‘దళిత,గిరిజన సదస్సును విజయవంతం చేయాలి’

‘దళిత,గిరిజన సదస్సును విజయవంతం చేయాలి’
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

 పరిగి: గజ్వేల్‌లో ఈనెల 17 శుక్రవారం జరుగనున్న దళిత,గిరిజన సదస్సుకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా హాజరు కావాలని  డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి  పిలుపు నిచ్చారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  జిల్ల్లాలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకవాహనాల్లో తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రేణులను ఆయన కోరారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధానకార్యదర్శి కె.హణ్మంత్‌ముదిరాజ్‌, పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు అక్బర్‌సేట్‌, నాయకులు సర్వర్‌, నాగవర్ధన్‌, శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిపాల్గొన్నారు. ఈనెల 18న కాంగ్రెస్‌పార్టీ  చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని పరిగిలో నిర్వహించనున్నట్లు రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధానకార్యదర్శి,  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యంఠాకూర్‌, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌గౌడ్‌, ప్రధానకార్యదర్శి జగదీష్‌, ఉపాధ్యక్షుడు ఎం.రమేశ్‌మహారాజు హాజరవుతున్నారని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని  పార్టీ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, బ్లాక్‌, డివిజన్‌స్థాయి అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొనాలని సూచించారు. 

Updated Date - 2021-09-17T06:03:16+05:30 IST