దళిత్ శక్తి ప్రోగ్రామ్ ఆన్‌లైన్ ప్లీనరీ

ABN , First Publish Date - 2020-10-09T05:54:28+05:30 IST

దళిత్ శక్తి ప్రోగ్రామ్ (డి.ఎస్.పి) ప్రారంభమై నేటికి పదకొండు సంవత్సరాలవుతోంది. కాన్షీరామ్ మరణించినప్పటి కన్నీళ్ళ నుంచి, ఆ తర్వాతి...

దళిత్ శక్తి ప్రోగ్రామ్ ఆన్‌లైన్ ప్లీనరీ

దళిత్ శక్తి ప్రోగ్రామ్ (డి.ఎస్.పి) ప్రారంభమై నేటికి పదకొండు సంవత్సరాలవుతోంది. కాన్షీరామ్ మరణించినప్పటి కన్నీళ్ళ నుంచి, ఆ తర్వాతి మూడేళ్ళ అంతులేని దుఃఖం నుంచి 2009 అక్టోబరు 09న ఈ సంస్థ పురుడు పోసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో డిఎస్‌పి ఎన్నో అవమానాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ అగ్నిశిఖల మధ్య తనను తాను చెక్కుకొని నిలువెత్తు ఆత్మగౌరవ శిల్పంలా నిలబడింది. అంబేడ్కర్ చూపిన మార్గంలో దళితులలో సాంస్కృతిక, వ్యక్తి నిర్మాణం కోసం జ్ఞానాన్ని బోధిస్తూ వేలమంది కార్యకర్తల్ని నిర్మించుకుని, లక్షలాదిమంది దళితుల్ని సమీకరించగలిగింది. ఈ పదకొండేళ్ళ ప్రయాణాన్ని సమీక్షించుకొని, భవిష్యత్తులో చేపట్టనున్న భారీ కార్యక్రమాలను రూపుదిద్దటానికి నేడు డిఎస్‌పి ప్లీనరీ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో ఐదు వేలమంది డిఎస్‌పి ప్రతినిధులతో జరిగే ఈ ప్లీనరీ నేటి ఉదయం 10గంటలకు ప్రారంభమై అక్టోబరు 14వరకు ఐదు రోజుల పాటు జరుగుతుంది. వివరాల కోసం 96408 92950 నెంబర్‌ను సంప్రదించవచ్చు.

విశారదన్ మహారాజ్, రాష్ట్ర కన్వీనర్ 

Updated Date - 2020-10-09T05:54:28+05:30 IST