దళితుల భూములే సేకరిస్తారా?

ABN , First Publish Date - 2020-02-20T10:12:27+05:30 IST

‘వైఎస్‌ఆర్‌ నవశకం’లో పేదలకు పంపిణీ చేసేందుకు దళితుల భూములనే సేకరి స్తున్నారని, దీంతో

దళితుల భూములే సేకరిస్తారా?

శాసనసభ ఎస్సీ కమిటీని నిలదీసిన దళిత సంఘాలు

జడ్పీ సమావేశ మందిరంలో ఆందోళన


 గుజరాతీపేట, ఫిబ్రవరి 19: ‘వైఎస్‌ఆర్‌ నవశకం’లో పేదలకు పంపిణీ చేసేందుకు దళితుల భూములనే సేకరి స్తున్నారని, దీంతో వారంతా తీవ్ర అన్యాయానికి గురవు తు న్నారని పలు దళిత సంఘాల ప్రతినిధులు రాష్ట్ర శాసనసభ ఎస్సీ కమిటీ సభ్యులను నిలదీశారు. బుధ వారం జడ్పీ సమావేశ మందిరంలో దళితుల సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి (ఎస్‌ఎన్‌ పీఎస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్‌, కులనిర్మూలనా పోరాట సమితి (కేఎన్‌ పీఎస్‌) జిల్లా కార్య దర్శి బెలమర ప్రభాకరరావు, వ్యవసాయ కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారపు సింహాచలం తదితరుల ఆధ్వ ర్యంలో దళిత సంఘాల ప్రతి నిధులు నిరసన తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలను అందజేసే కార్యక్రమాన్ని స్వాగ తి స్తున్నామని, అయితే 1976లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జిల్లాలోని దళిత కుటుం బాల జీవనోపాధికి కేటా యించిన ల్యాండ్‌సీలింగ్‌ భూములతో పాటు  డి-పట్టా భూ ములను రెవెన్యూ అధికారులు సేకరించడం దారుణమని గణేష్‌ ఎస్సీ కమిటీ చైర్మన్‌ గొల్ల బాబూరావును నిలదీశారు.


దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. గణేష్‌తో పాటుగానే మిగిలిన దళిత సంఘాల నాయకులు కుర్చీలపై ఎక్కి ప్రశ్న ల వర్షం కురిపించారు. భూ సేకరణను అడ్డుకుంటున్న దళితులపై పోలీసు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరో పించారు. జిల్లా అంతటా దళితులకు చెందిన సుమారు 700 ఎకరాల భూమిని సేకరించారని, ఇది దారుణ మన్నా రు. దళితులకు జరిగిన అన్యాయంపై మొరపెట్టు కునేం దుకు వెళ్తే అనుకూలమా? వ్యతిరేకమా? అని జిల్లాలోని మంత్రి అనుచరులు ప్రశ్నిస్తున్నారన్నారు.


ఇప్పటి కైనా ఎస్సీ, ఎస్టీ లకు చెందిన భూములను తీసుకోకుండా తగు న్యాయం చేయా లని దళిత గిరిజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బోసు మన్మధరావు కోరారు. దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సాకేటి నాగరాజు, రెల్లి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పి.సుధ, మాల మహానాడు జిల్లా అధ్య క్షుడు బోనెల అప్పారావు తదితరులు కమిటీకి పలు సమ స్యలపై ఫిర్యాదులను అందించారు. దళితులకు జరుగుతు న్న అన్యాయాలపై సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తుం డటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.


దీంతో కమిటీ చైర్మన్‌ గొల్ల బాబూరావు కలుగజేసుకొని దళితుల సమస్య లను వివరించాలని కోరడంతో రిటైర్డ్‌ తహసీల్దార్‌ రామ ప్పడు, గణేష్‌ వివరించారు. సమావేశంలో గందర గోళం ఏర్పడడంతో ఒకటో పట్టణ ఎస్సై సింహాచలం తన సిబ్బం దితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన దళిత సంఘాల ప్రతినిధులు, దళితుల నుంచి ఎస్సీ కమిటీ సభ్యులు వినతులను స్వీకరిం చారు. కార్యక్రమంలో శాసనసభ ఎస్సీ కమిటీ సభ్యులు కం బాల జోగులు, గుమ్మిడి సంధ్యా రాణి, ఎండపల్లి శ్రీనివా సరెడ్డి, వెన్నుమట్ల ఎలైజా, అలజంగి జోగారావు, కొండేటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T10:12:27+05:30 IST