నివేశన స్థలం కోసం భూమి లాగేసుకున్నారు!

ABN , First Publish Date - 2020-07-14T08:32:54+05:30 IST

దశాబ్దాలుగా తన సాగులో ఉన్న భూమిని ఇళ్ల స్థలాల కోసమంటూ అధికారులు బలవంతంగా లాక్కోవడంతో మంచం

నివేశన స్థలం కోసం భూమి లాగేసుకున్నారు!

  • తీవ్ర మనస్తాపంతో దళితుడు మృతి

చిట్టమూరు, జూలై 13: దశాబ్దాలుగా తన సాగులో ఉన్న భూమిని ఇళ్ల స్థలాల  కోసమంటూ అధికారులు బలవంతంగా లాక్కోవడంతో మంచం పట్టిన ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. బాధితుల కథనం మేరకు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలోని సర్వే నం.60-1బీలో సుమారు 50 సెంట్ల స్థలం 30 ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన 8 మంది ఆధీనంలో ఉంది. నివేశన స్థలాల పట్టాల పంపిణీ పేరుతో ఆ భూమిని 13 దళితేతరులకు కట్టబెట్టేందుకు అధికారులు యత్నించారు. దళితులకు కూడా భూమిని పొందేందుకు అర్హత ఉన్నా, రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం భూమిని లాక్కున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఉడత చిన్నయ్య (58) అనారోగ్యానికి గురై మృతి చెందాడు. 

Updated Date - 2020-07-14T08:32:54+05:30 IST