దరి చేరని దళితబంధు!

ABN , First Publish Date - 2022-04-25T05:40:13+05:30 IST

దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టా రు. ఈ పథకం ద్వారా యూనిట్‌ రూ.పది లక్షలు ఇవ్వనునట్లు ప్రకటించారు.

దరి చేరని దళితబంధు!
దళితబంధు లబ్ధిదారులకు అందించేందుకు తీసుకువచ్చిన వాహనాలు...(ఫైల్‌)




జిల్లాలో 249 మంది ఎంపిక
మార్చి 31తో ముగిసిన గడువు
ఇప్పటి వరకు జిల్లాలో 209 మందికి  పత్రాల పంపిణీ
అయినా పూర్తి స్థాయిలో అందని యూనిట్లు
అసలే రాని 39 మందికి తప్పని ఎదురు చూపులు

ఆదిలాబాద్‌ టౌన్‌, మార్చి24 : దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టా రు. ఈ పథకం ద్వారా యూనిట్‌ రూ.పది లక్షలు ఇవ్వనునట్లు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం దళితులకు గడువు ముగిసినా దళితల ధరి చేయడం లేదు. మార్చి 31 నాటికి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గల వారీగా వంద మంది చొప్పున ఎంపిక చేసిన లబ్ధిదారులకు దళితబంధు నిధులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పథకం విషయలో మాత్రం ప్రభుత్వం చెబుతున్న మాటలకు తీసుకుంటున్న చర్యలకు పొంతన ఉండడం లేదు. జిల్లాలో అధికారులు ఎంపిక చేసిన 248 మంది లబ్ధిదారులకు అందడం లేదు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లాలోని 467 గ్రామ పంచాయతీల్లో 30, 565 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో లక్షా 12 వేల 932 మంది జనాభాలో ఉన్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో 200 కుటుంబాలు, ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఉన్న ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో కలిపి దళిత లబ్ధిదారులను గడిచిన రెండు నెలల క్రితం అధికారులు ఎంపిక చేశారు. ముందుగా ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు 271 మందిని ఎంపిక చేశామని తెలిపారు. వీరికి గత నెల 7వ తేదీలోగా యూనిట్లు గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను లబ్ధిదారులకు పథకంపై అవగాహన కల్పించారు.
209 మందికి పత్రాల పంపిణీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకంలో దళిత లబ్ధిదారులకు రూ.10లక్షలు అందించేందుకు అధికారులు సర్వేలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేశారు. 5 ఫిబ్రవరి 2022 నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయలన్న జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గల్లోని నాలుగు మండలాలను కలుపుకొని సంబంధిత అధికారులు 271 మందికి ఎంపిక చేసినట్లు గతంలో తెలిపారు. అయితే ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్థిక సాయం రూ.పది లక్షలు ఎప్పుడు ఇస్తారోనని వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. మార్చి ఏడుతో గడువు ముగిసిన ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో కొంత నిరాశకు లోనయ్యారు. ఇలాంటి సమయంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా అధికారులు 271 మందికి బదులు 249 మందితో ఎంపిక చేసిన జాబితాను కలెక్టర్‌కు అందజేశారు. ఇందులో భాగంగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ 249 మంది లబ్ధిదారుల్లో 209 మందికి దళితబంధుకు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి అందజేశారు. ఇందులో ఇంకా 39 మందికి మాత్రం దళిత బంధులో ఎంపికైన ఎలాంటి పత్రాలు మాత్రం అందించపోవడం గమనార్హం.
పత్రాలు ఇచ్చినా కనిపించని యూనిట్లు..
జిల్లాలో దళితబంధు పథకం కింద ఎంపికైన 249 కుటుంబాలకు గాను అంబేద్కర్‌ జయంతి రోజున 209 మంది కుటుంబాల్లో 80 మందికి వివిధ వాహనాలకు సంబంధించిన పత్రాలతో పాటు వాటి తాళం చెవిలను ఆర్భాటంగా అందించారు. అయితే సంబంధిత వాహనాలకు గాను వాటి షో రూం యజమానులకు డబ్బులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులకు వాహనాలను ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. దీంతో దళిత బంధు పథకంలో రూ.పది లక్షలు పొందామన్న సంతోషం క్షణ కాలంలోనే ఆవిరైంది. ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద ఆస్తులకు సంబంధించిన పత్రాలున్న వాహనాలు మాత్రం లేక పోవడంతో అవి ఎప్పుడు ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులను అడగగా లబ్ధిదారులు కోరుకున్న వాహనాలు లేక పోవడంతో మూడు నెలల పాటు ఆగాల్సి ఉంటుందని, అందుకు గాను వారికి సంబంధించిన రూ.పది లక్షలను వారి ఖాతాలో కలెక్టర్‌ జాయింట్‌ అకౌంట్‌లో జమ చేయడం జరిగిందని చెబుతున్నారు.
అసలు రాని వారు 39 మంది..
ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో జిల్లా వ్యాప్తంగా 249 మందిని అధికార యంత్రాంగం ఎంపిక చేసింది. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని 209 మందికి వారివారి రూ.పది లక్షలు విలువ చేసే యూనిట్ల పత్రాలను ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌లు పంపిణీ చేశారు. 209 మందిలో 80 మందికి కార్లు, ట్రాక్టర్లు కేటాయించగా మరో 129 మంది వివిధ యూనిట్లకు గాను పత్రాలను పంపిణీ చేశారు. ఇందులో వాహనాలతో పాటు వివిధ యూనిట్ల కోసం నేటికి లబ్ధిదారులు ఎదురుచూడక తప్పడం లేదు. ఇదిలా ఉంటే జిల్లాలో 249 మందిలో పథకానికి ఎంపికైనా అసలే రాని 39 మంది లబ్ధిదారులు రూ.పది లక్షలు తమకు ఎప్పుడు వస్తాయోనని ఆయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం దళితబంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు ఎలాంటి తిరకసులు లేకుండా.. బ్యాంక్‌ లీంకేజీలు లేకుండా రూ. 10 లక్షలు వివిధ ఆస్తులు, యూనిట్ల రూపంలో అందిస్తున్నదున ఆలస్యం చేయకుండా లబిదారులకు ఇచ్చి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
అందరికీ దళితబంధు..
- శంకర్‌ ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ఆదిలాబాద్‌

దళితబంధు పథకంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనిట్లను అందించడం జరుగుతుంది. నిబంధనల ప్రకారమే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం. వారు కోరుకున్న వాహనాలు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారునికి ఖాతాలోనే కలెక్టర్‌ జాయింట్‌ అకౌంట్‌లో పది లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది. ప్రతి ఒక ్క దళిత కుటుంబానికి పథకం అందేలా కృషి చేస్తున్నాం.

Updated Date - 2022-04-25T05:40:13+05:30 IST