పని చేయనన్నందుకు దళిత యువకుడికి దారుణ అవమానం.. అందరి ముందు కొట్టి, మూత్రం తాగించి.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-10T08:08:06+05:30 IST

పని చేసేందుకు నిరాకరించిన ఓ యువకుడిపై యజమాని దారుణానికి ఒడిగట్టాడు.. అతడిని కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా అవమానించాడు.. అతడిని చితక్కొట్టి మూత్రం తాగించాడు.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...

పని చేయనన్నందుకు దళిత యువకుడికి దారుణ అవమానం.. అందరి ముందు కొట్టి, మూత్రం తాగించి.. చివరకు..

పని చేసేందుకు నిరాకరించిన ఓ యువకుడిపై యజమాని దారుణానికి ఒడిగట్టాడు.. అతడిని కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా అవమానించాడు.. అతడిని చితక్కొట్టి మూత్రం తాగించాడు.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు.. రాజస్థాన్‌లోని రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. 


రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన దశరథ్ సింగ్ కైలాష్‌ మద్యం కాంట్రాక్టర్. తన మద్యం షాపులో పని చేయాల్సిందిగా తన దగ్గర గతంలో పని చేసిన కైలాష్ కోలీని అడిగాడు. అందుకు కోలి అంగీకరించలేదు. పనిలో తేడా వస్తే తిడతాడని, జీతం సరిగ్గా ఇవ్వడని చెప్పి అతని వద్ద పని చేసేందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దశరథ్.. కోలిపై దాడికి దిగాడు.  ప్లాస్టిక్ వైర్‌తో తనను కనికరం లేకుండా కొట్టాడు. అనంతరం తన మూత్రం తాగించి గదిలో బంధించాడు. 


కోలి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు వెళ్లి రక్షించారు. బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దశరథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 


Read more