దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ‘దళిత బంధు’

ABN , First Publish Date - 2022-05-17T05:18:26+05:30 IST

దళితుల జీవితాల్లో వె లుగులు నింపడానికే దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారని రామగుం డం ఎమ్మెల్యే చందర్‌ అన్నారు.

దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ‘దళిత బంధు’
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ 

గోదావరిఖని, మే 16: దళితుల జీవితాల్లో వె లుగులు నింపడానికే దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారని రామగుం డం ఎమ్మెల్యే చందర్‌ అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ గుండం నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని వర్తింపచేస్తామ ని, దళిత బహుజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. గతంలో వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాం కుల ద్వారా ఎస్‌సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పొందాలంటే చాలా ఇబ్బందులు పడేవారని, జమానత్‌లు, జా మీనుల పేరిట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవారని, ఇప్పుడు ఎలాంటి షూరిటీలు లేకుండా రుణాలను అందించడం జరుగుతుందన్నారు. రామగుండం నియోజకవర్గంలో మొదటి విడతగా 100 దళిత బంధు యూనిట్లు మంజూరయ్యాయని, రెండో విడుతలో 1500 యూనిట్లు మంజూరుకానున్నట్టు తెలిపారు. ప్రతి దళిత కుటుంబం సమాజంలో ఆర్థికంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ పథకాన్ని దళితులంతా ఉప యోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:18:26+05:30 IST