దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-30T03:41:20+05:30 IST

దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువా రం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పడ్తన్‌పల్లిలో దళిత బంధు లబ్ధిదారులకు ట్రాక్టర్‌లను అందజేశారు.

దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పడ్తన్‌పల్లిలో లబ్ధిదారులకు ట్రాక్టర్‌లు పంపిణీ చేస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌

హాజీపూర్‌, సెప్టెంబరు 29:  దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువా రం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పడ్తన్‌పల్లిలో దళిత బంధు లబ్ధిదారులకు ట్రాక్టర్‌లను అందజేశారు.  ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పథకం ప్రవేశపెట్టారన్నారు.  త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 500 యూనిట్లను సీఎం అందజేస్తా రన్నారు. లబ్ధిదారుకు నష్టం జరిగితే దళిత రక్షణ కింద లబ్ధి పొందవచ్చన్నారు. ఎస్సీ సేవా సహకార అభివృద్ధి ఈడీ దుర్గా ప్రసాద్‌, సర్పంచు గోల శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ భాగ్యలక్ష్మీ,  కార్యదర్శి రాజమణి, నాయకులు పాల్గొన్నారు. 

జైపూర్‌: దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండారి శ్రీనివాస్‌ అన్నారు.  గురువారం ముదిగుంటలో దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన సిరామిక్స్‌, ఫౌల్ర్టీ ఫాం యూనిట్‌లను పరిశీలించారు.  

నస్పూర్‌: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీని వాస్‌ను సింగరేణి అతిథి గృహంలో టీఆర్‌ఎస్‌ నాయ కులు  కలిశారు.  రాష్ట్ర సచివాలయ భవనానికి అంబే ద్కర్‌ పేరు పెట్టినందుకు చైర్మన్‌ను ఘనంగా సన్మానిం చారు. యువజన విభాగం పట్టణ ప్రధాన కార్యదర్శి కాటం రాజు,  జాయింట్‌ కార్యదర్శి మహ్మద్‌ సాజిద్‌,  నాయకులు కొయ్యల రమేష్‌ పాల్గొన్నారు.   

మందమర్రి: ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌ను   సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో  సన్మానించారు.  సింగరేణిలో కార్మికులు, ఉద్యోగులు ఎదు ర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కనుకుల తిరుపతి, జీడి బాపు, దాసరి సుదర్శన్‌, వాసాల శంకర్‌, పురుషోత్తం, శ్రీనివాస్‌, నర్సయ్య, కృష్ణా పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T03:41:20+05:30 IST