Abn logo
Sep 23 2021 @ 15:42PM

దళితులపై ప్రేమతో దళితబంధు ఇవ్వడం లేదు: ఈటల

హుజురాబాద్: ఓట్ల మీద ప్రేమతోనే దళితబంధు ఇస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులపై ప్రేమతో దళితబంధు ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ ఎందుకు చేయట్లేదు? అని ఈటల ప్రశ్నించారు. కుట్రలో భాగస్వామ్యం తప్ప అభివృద్ధిపై మంత్రి హరీష్‌రావుకు ధ్యాస లేదని విమర్శించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...