రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి: ఎంపీ కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-09-05T02:30:59+05:30 IST

దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని భువనగిరి ఎంపీ కోమటివెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు దళితున్నే

రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి: ఎంపీ కోమటిరెడ్డి

నల్గొండ: దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని భువనగిరి ఎంపీ కోమటివెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు దళితున్నే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి దళితులపై కపట ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్‌ ఎన్నికల సమయంలో 50 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చేప్పి ఆరు మాసాలు దాటినా ఇంతవరకు నోటిఫికేషన్‌ వేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదన్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఐకమత్యంతో ముందుకు సాగితే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-05T02:30:59+05:30 IST