దళితులకు బంధువుగా ‘దళిత బంధు’

ABN , First Publish Date - 2022-01-23T04:34:24+05:30 IST

దళితబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం

దళితులకు బంధువుగా ‘దళిత బంధు’
మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జనవరి 22 : దళితబంధు  పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దళితుల బంధువుగా ముందుకు వెళ్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దళిత బంధు పథకం జిల్లాలో అమలులో భాగంగా శని వారం సాయంత్రం మంత్రి అధికారిక నివాసం నుంచి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్‌, అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో ఎక్కడ చూసినా దళితుల బతుకులు చీకట్లో ఉన్నాయని గ్రహించిన సీఎం కేసీఆర్‌.. వారి జీవితాల్లో వెలుగు ప్రసాదించి ఆర్థికంగా బలపడేందుకు ఈ పథకం తీసుకువచ్చారని తెలిపారు. దళితబంధు పథకం ద్వారా ఎంపిక చేసిన ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు అకౌంట్‌లో జమ చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా వాటా కింద జమ చేసుకొని దానికి మరో రూ.10 వేలు కలిపి ప్రభుత్వం దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తుందన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో దళితబంధు సమితిలు ఏర్పాటు చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 1,18,514 దళిత కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందన్నారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్త అమలు కోసం రూ.1200 కోట్లు సర్కార్‌ విడుదల చేసిందని తెలిపారు. వారంలోగా ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని, ఫిబ్రవరి నెలాఖరులోపు లబ్ధిదారుల అకౌంట్‌ నెంబర్లు, ఇతరత్రా అన్ని  ప్రక్రియలు పూర్తిచేసి మార్చి మొదటివారం వరకు గ్రౌండింగ్‌ పూర్తి చేయాలన్నారు. ఒక కుటుంబం రెండు మూడు స్కీంలు చేయవచ్చని, రెండు మూడు కుటుంబాలు రూ.20, 30లక్షలతో పెద్ద వ్యాపారాలు కూడా చేయొచ్చన్నారు. దళితులు సమాజంలో ఆర్థికంగా ఎదిగి స్వయంసమృద్ధి సాధించాలన్నదే కేసీఆర్‌ అభిమతమన్నారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, గకలెక్టర్‌ అమయ్‌కుమార్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ బోర్డు చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌, అంజయ్యయాదవ్‌, జైపాల్‌యాదవ్‌, అధికారులు పాల్గొన్నారు. 


ప్రతి నియోజకవర్గంలో ‘దళితబంధు’ : కలెక్టర్‌ 

ప్రతి నియోజకర్గంలో దళితబంధు పథకం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. దళితబంధు అమలుపై జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరవడం, జాబితాలు సిద్ధం చేయడం, సకాలంలో యూనిట్లు గ్రౌండ్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎస్‌ సోమే్‌షకుమార్‌కు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, డీఆర్వో హరిప్రియ, జడ్పీ సీఈవో దిలీ్‌పకుమార్‌, సీపీవో ఓంప్రకాశ్‌, బీసీ కార్పొరేషన్‌ అధికారి విద్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-23T04:34:24+05:30 IST